ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్యానెల్స్ రావడం దురదృష్టకరమని నటి జీవితా రాజశేఖర్ అన్నారు.ఏదైనా ఒక ప్యానెల్ కు ఫుల్ పవర్ ఇస్తే బాగుంటుందన్నారు.
ఇండస్ట్రీలో స్వార్థం లేకుండా యాక్టివ్ గా పని చేసేవారు కావాలని చెప్పారు.‘ మా ’ ఎన్నికల్లో అలా జరగలేదు.
ఇప్పుడూ జరగడం లేదని తెలిపారు.ఎవరితోనైనా మాట్లాడే సత్తా ఉండే వారు కావాలని పేర్కొన్నారు.
అలాంటి వారితోనే చిత్ర పరిశ్రమకు మంచి జరుగుతుందని వెల్లడించారు.తాను ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ మార్పు కనిపించలేదని తెలిపారు.







