మూడో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్న పవన్ ! 

జనసేన( Janasena ) అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan ) వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వైసిపిని ఓడించే విధంగా, ప్రజల్లో మార్పు తీసుకువచ్చేందుకు మొదలుపెట్టిన వారాహి యాత్ర మొదటి, రెండో విడతలు సక్సెస్ఫుల్ గా  సాగాయి.ఊహించని విధంగా పవన్ యాత్రకు జనాల నుంచి రెస్పాన్స్ వచ్చింది.

 Pawan Is Preparing For The Third Installment Of Varahi Yatra, Pavan Kalyan, Var-TeluguStop.com

ఇక పదునైన విమర్శలతో వైసిపిని ఇరుకును పెట్టడంలో పవన్ నక్సెస్ అయ్యారు.అనుకున్న దానికంటే ఎక్కువగా ఈ సభ సక్సెస్ కావడంతో పవన్ లోను కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

గతంలో జనసేన పరిస్థితి పై పవన్ లోను , ఆ పార్టీ నాయకులలోనూ ఏదో తెలియని ఆందోళన కనిపించినా, మొదటి రెండో విడత యాత్రలు సక్సెస్ కావడం తో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.ఇక మూడో విడత వారాహి యాత్రను చేపట్టేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Varahi-Politics

 వచ్చే నెల ఆగస్టు నుంచి ఈ యాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారు.మూడో విడత యాత్రను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలుపెట్టే ఆలోచనతో ఉన్నారు.ఆగస్టులో విశాఖ నుంచి ఈ యాత్రను మొదలుపెట్టి,  ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన ప్రభావాన్ని పెంచే విధంగా పవన్ ప్రయత్నాలు చేయబోతున్నారు ఉత్తరాంధ్ర అంటేనే ఒకప్పుడు టిడిపి కంచుకోట .2019 ఎన్నికల్లో ఆ కోటకు బీటలు పడడంతో ఇప్పుడు తమ పార్టీకి  ఆదరణ పెంచుకోవాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారు మూడో విడత వారాహి యాత్రలో గాజువాక ,పెందుర్తి , విశాఖ నార్త్, భీముని పట్నం,  అనకాపల్లి, యలమంచిలి, చోడవరం,పాయకరావుపేటలో  నిర్వహించి .ఆ తరువాత విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాల్లో యాత్రను కొనసాగించేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.జగన్ ఉత్తరాంధ్ర యాత్రలో ఆయన పర్యటించే నియోజకవర్గాల్లో కీలక ప్రసంగాలు చేయబోతున్నారు .తమ పార్టీ పోటీ చేయబోయే సీట్ల గురించి మాట్లాడబోతున్నారట

Telugu Ap, Chandrababu, Jagan, Janasena, Pavan Kalyan, Varahi-Politics

అలాగే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రధాన సమస్యల పైన,  వైసిపి( YCP party ) నాయకుల అవినీతి వ్యవహారాల పైన స్పందించేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.  అప్పుడే పవన్ యాత్రను సక్సెస్ చేసేందుకు జనసేన నేతలు రంగంలోకి దిగారు .ఈ మేరకు ఇటీవల జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వారాహి ఉత్తరాంధ్ర విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube