విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇప్పుడున్న హీరోలందరి కంటే విభిన్న శైలి లో ముందుకు వెళ్తున్న హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan )…ఈయన చేసిన తెలుగు సినిమాల్లో మహానటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గా నిలించింది అయితే ఇది సావిత్రి గారి బయో పిక్ కావడం వల్ల ఇది హీరోయిన్ బేస్డ్ మూవీ అని చెప్పాలి…ఇక ఈ సినిమా తర్వాత తెలుగు లో చేసిన మరో సినిమా సీత రామం( Sitaramam ) ఈ సినిమా తోని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా చాలా పెద్ద హీరో గా గుర్తింపు పొందాడు నిజానికి ఈ సినిమా లో ఆయన తప్ప ఎవరూ చేసిన ఈ సినిమా అంతా పెద్దగా వర్క్ ఔట్ అయ్యేది కాదు అని ఆ సినిమా చూశాక మనకే అనిపిస్తుంది…ఇక ఈ మూవీ తర్వాత ఆయన చేసిన సినిమా చుప్ ఇది ఒక డిఫెరెంట్ కథతో తెరకెక్కింది ఈ సినిమా తో ఆయన బాలీవుడ్( Bollywood ) సినిమాలో కూడా నటించారు.
ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ ఆర్ భల్కి ( Director R Bhalki )దర్శకత్వం వహించారు.
సన్నీ డియోల్, శ్రేయా దంవర్తీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా గత ఏడాది ధియేటర్లలో రిలీజ్ అయ్యి, మంచి టాక్ తెచ్చుకుంది.ప్రస్తుతం జీ 5 ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముంబైలో వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి.
హిందీ చిత్రాలకు తక్కువ రేటింగ్ ఇస్తూ రివ్యూలు రాసే క్రిటిక్స్‌ను లక్ష్యం చేసుకుని, వారు రివ్యూను ఏ స్టైల్‌లో రాశారో, ఒక సీరియల్ కిల్లర్ అదే స్టైల్‌లో వారిని హత్య చేస్తుంటాడు.

దాంతో క్రిటిక్స్ ఆ సీరియల్ కిల్లర్ ను చంపేవరకు రివ్యూలు రాయమని అని చెప్పడంతో, కిల్లర్ ను పట్టుకోవడానికి పోలిస్ ఆఫీసర్ సన్నీ డియోల్ వస్తాడు.ఆ తర్వాత ఏం జరిగింది? సీరియల్ కిల్లర్‌ను పట్టుకున్నారా? లేదా అనేది మిగిలిన కథ.సినిమాలకు రివ్యూలు రాసే క్రిటిక్స్ ను చంపడం, వాళ్ళ నుదుటి పై స్టార్స్ రేటింగ్ వేసే కిల్లర్ కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది.దర్శకుడు ఆర్ బాల్కీ కథ ఐడియా విషయంలో తన ప్రత్యేకత చాటుకున్నారు.అయితే దానిని మూవీ మొత్తం చూపించలేకపోయారు.

సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకుంటుంది.కానీ ఇంటర్వెల్ తర్వాత హంతకుడు ఎవరు అనే విషయం తెలిసిన తరువాత కథనం స్లోగా సాగుతుంది.సగటు థ్రిల్లర్ చిత్రాల తరహాలోనే ఈ మూవీ సాగింది.తిరిగి క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ వస్తుంది.దుల్కర్ సల్మాన్ ఈ మూవీలో మరోసారి అద్భుతమైన నటనతో పాత్రకు జీవం పోశారు.దుల్కర్ లేకపోతే మూవీ నిలబడేది కాదు.
దుల్కర్ క్యారెక్టర్ లో మరొకరిని ఊహించలేము.శ్రేయా ధన్వంతరి, సన్నీ డియోల్ చక్కగా నటించారు.
అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ లో ఒక్క సీన్ లో కనిపించారు.దుల్కర్ నటన కోసం చూడాల్సిన మూవీ ఇది.అయితే ఒక నటుడు ఇమేజ్ చట్రం లో ఇరుక్కోకుండా డిఫరెంట్ సినిమాలు చేస్తూ అన్ని లాంగ్వేజ్ లలో కూడా డైరెక్ట్ గా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని రోజు రోజు కూ పెంచుకుంటూ పోతున్నాడు దుల్కర్ సల్మాన్… వాళ్ల నాన్న అయిన మమ్ముట్టి స్టార్డం ని ఎక్కడ వాడకుండా తనంతట తానే సోలో గా ఇండస్ట్రీ లో ఎదుగుతున్నాడు.








