Jayasuda:నటి జయసుధ చూపు బిజెపి వైపు.. పోటీ ఎక్కడి నుంచి అంటే ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు పొందిన జయసుధ రాజకీయాల్లో కూడా తనదైన మార్కు చూపిస్తోంది.గతంలో ఓసారి ఎమ్మెల్యే గెలిచిన జయసుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది.

 Jayasudha To Join Bjp-TeluguStop.com

పూర్తి వివరాలు ఏంటో చూద్దామా.త్వరలో తెలంగాణ( telangana ) రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

దీంతో ఆయా పార్టీలన్నీ ప్రజల్లో మమేకమయ్యేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి.అంతేకాకుండా పార్టీలో మార్పులు చేర్పులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ తరుణంలోనే ప్రముఖ సినీనటి మాజీ ఎమ్మెల్యే జయసుధ ( jayasudha ) పార్టీ మార్పుపై వార్తలు వినిపిస్తున్నాయి.శుక్రవారం ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ని కలిశారు.

Telugu Bjp, Congress, Jayasudha, Kishan Reddy, Telangana-Movie

ఈ క్రమంలో ఆమె బిజెపిలో చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.కిషన్ రెడ్డి కూడా ఇదే అంశంపై ఆమెతో చర్చించినట్టు సమాచారం.సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ తర్వాత 2009లో కాంగ్రెస్( congress ) నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.

అలాంటి జయసుధ ప్రస్తుతం పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది.ఈ తరుణంలో ఆమె ఉత్తర తెలంగాణకు చెందినటువంటి ఒక నిర్మాతతో కలిసి బిజెపి నేతలను కలిసినట్టు సమాచారం.

అంతేకాకుండా బీజేపీ( bjp ) పార్టీ చేరికల కమిటీతో కలిసి జయసుధ చర్చలు జరిపినట్టు సమాచారం అందుతుంది.అయితే జయసుధ ఇప్పుడే కాకుండా గతంలో కూడా బిజెపి నాయకులను కలిసిందని కానీ ఆమె ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని వారు అంటున్నారు.

Telugu Bjp, Congress, Jayasudha, Kishan Reddy, Telangana-Movie

కానీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు కిషన్( kishan reddy ) కలిసి పార్టీలోకి వచ్చేందుకు క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.అయితే ఆమె పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉంది కానీ, పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో సస్పెన్స్ పెడుతూ వస్తున్నారు.మరి చూడాలి ఆమె ఆ పార్టీలో చేరుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube