టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోని నటులలో జేవీ సోమయాజులు( J.V.Somayajulu ) టాప్ ప్లేస్‌లో ఉంటారు.ఈరోజు ఆ టాలెంటెడ్ యాక్టర్ జయంతి.
ఈ సందర్భంగా ఆయన గురించి తెలియని కొన్ని విశేషాలు తెలుసుకుందాం.సోమయాజులు 1928, జులై 30న శ్రీకాకుళం జిల్లాలోని లుకాలం అగ్రహారంలో జన్మించారు.
ఆయన చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి చూపించారు.చాలా నాటకాల్లో నటించారు.
ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.మీ ఆయన మనసు ఎప్పుడూ కూడా నటన పైనే ఉండేది.

అందుకే జాబ్ పక్కన పెట్టేసి రారా కృష్ణయ్య సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు.ఆయన తొలి సినిమా అంతగా విజయం సాధించలేదు, కానీ ఆ సినిమాలో ఆయన చేసిన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది.తరువాత 1980లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం( Sankarabharanam )’ సినిమా జేవీ సోమయాజులుకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి పాత్రలో అద్భుతంగా నటించినందుకు ఆయనకు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది.అలా సోమయాజులు 50 ఏళ్ళ వయసులో స్టార్డమ్ సంపాదించి ఆశ్చర్యపరిచారు.సోమయాజులు 100కి పైగా సినిమాల్లో నటించారు.
ఆయన తన నటనతో ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేని పాత్రలను సృష్టించారు.ఆయన నటించిన కొన్ని ప్రసిద్ధ సినిమాలు చూసుకుంటే అందులో శంకరాభరణం, వంశ వృక్షం, ప్రతిబంధ్, కలియుగ పాండవులు, సితార, స్వాతి ముత్యం, విజేత, శ్రీ షిరిడి సాయిబాబా మహాత్మ్యం, మజ్ను, స్వయంకృషి, అభినందన, అప్పుల అప్పారావు, ఆదిత్య 369, రౌడీ అల్లుడు, అల్లరి మొగుడు, సరిగమలు, శ్రీరాఘవేంద్రర్ ఉన్నాయి.

జేవీ సోమయాజులు భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు( Padma shri award )ను కూడా అందుకున్నారు.సోమయాజులు 2004 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.ఆయనకు అప్పటికి 75 సంవత్సరాల వయసు ఉంది.ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటుగా మారింది.ఆయన నటనను ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పవచ్చు.సోమయాజులు ఒక ప్రతిభావంతుడైన నటుడు.
సోమయాజులు తన గొప్ప నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.ఆయన తెలుగు సినిమాకు అద్భుతమైన సేవలందించారు.
అలాంటి ఆణిముత్యం తెలుగు నేలపై పుట్టినందుకు సాటి తెలుగువారిగా మనమందరం ఎప్పటికీ గర్వపడవచ్చు.