దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
దీంతో భారీగా మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
కాగా ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.







