“రింగు రింగు బిల్లా రూపాయి దండ… దండ కాదురా తామర మొగ్గ… మొగ్గ కాదురా మోదుగు నీడ… నీడ కాదురా నిమ్మల బాయి…” అని చిన్నపుడు చదువుకున్నాం కదా.దాదాపు అలాంటి ఓ దృశ్యమే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అది కారు కాదు కానీ, కారు లాంటిదన్నమాట.ప్రతిభకు భారత దేశంలో కొదువ లేదు.
కొందరు కార్లు, హెలికాప్టర్ల తయారు చేస్తుండగా, మరికొందరు స్కూటర్లు, ఇటుకలతో కూలర్లు వంటివి తయారు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.ఇదే కోవలోకి చెందిన ఒక వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

అవును, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో 4 చక్రాలతో కూడిన ఓ విచిత్ర వాహనం రోడ్డుపైన పరుగులు పెడుతుంది.దాన్ని తయారు చేసినవారిని చూస్తే మనం మెచ్చుకోకుండా ఉండలేము.వాహనానికి బైక్ ఇంజిన్ ( Bike engine )అమర్చడం ఇక్కడ మనం చూడవచ్చు.
అదేవిధంగా స్టీరింగ్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్టు కనబడుతోంది.ఇక పాత వస్తువులతో వాహనం బాడీ, పాత టైర్లను అమర్చి వాహనానికి ఫినిషింగ్ ఇచ్చారు.
దీనిని చూసినవారికి మొదట నవ్వు వస్తుంది.కానీ వారి టాలెంటుని మెచ్చుకోకుండా నెటిజన్లు ఉండలేకపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోను ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా నెటిజనం దానిని విపరీతంగా చూస్తున్నారు.కాగా ఈ వీడియోకి క్యాప్షన్‌లో “దేశీయ ఆవిష్కరణ”( Indigenous Innovation ) అని రాయడం కొసమెరుపు.29 సెకెన్ల నిడివిగల సదరు వీడియోలో ఇద్దరు యువకులు, ఇద్దరు పిల్లలు వాహనం మీద కూర్చుని మంచి జోష్ మీద రోడ్డుమీద వెళ్లడం మనం గమనించవచ్చు.దాంతో ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ లభిస్తున్నాయి.
నెటిజన్లు కామెంట్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది.ఇదేరా దేశీయ జుగాడ్ అని కొందరు కామెంట్స్ చేస్తే, మరికొందరు… భారతీయులకు సాటెవరు రారు అంటూ కెమెంట్స్ చేస్తున్నారు.
ఒక ఔత్సాహిక నెటిజన్ చిన్నపుడు తెలుగు సాహిత్యంలో చదువుకున్న గేయం… “రింగు రింగు బిల్లా రూపాయి దండ… దండ కాదురా తామర మొగ్గ…” అంటూ సరదాగా కామెంట్ చేయడం ఇక్కడ చూడవచ్చు!
.






