వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది.గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల నేపథ్యంలో చెరువుకు వరద నీరు భారీగా పోటెత్తింది.
దీంతో భద్రకాళి చెరువుకు గండి పడిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
గండి పడిందన్న సమాచారం అందుకున్న అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.కాగా భద్రకాళి చెరువుకు గండి పడటంతో పోతన నగర్, సరస్వతి నగర్ తో పాటు కాపువాడకు ముంపు వాటిల్లే అవకాశం ఉంది.







