పవన్ కళ్యాణ్ సాయితేజ్( Pawan Kalyan , Saitej ) కాంబినేషన్ లో సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన బ్రో సినిమా ప్రస్తుతం యావరేజ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు బాగానే ఉన్నా ఫుల్ రన్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయింది.
అయితే బ్రో సినిమాలో థమన్( Thaman ) ఇచ్చిన పాటలు ఏ మాత్రం బాలేవు.
ఈ పాటల కంటే సినిమాలో ఫస్టాఫ్, సెకండాఫ్ లో వచ్చిన పవన్ పాత సినిమాల పాటలు అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.బీజీఎం, పవన్ థీమ్ సాంగ్( BGM, Pawan theme song ) బాగానే ఉన్నా మిగతా సాంగ్స్ మాత్రం పవన్ ఫ్యాన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.
థమన్ పని అయిపోయిందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

థమన్ పెద్ద సినిమాల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.థమన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుండగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్థాయిలో సినిమాకు న్యాయం చేయడంలో ఫెయిల్ అవుతున్నారు.బ్రో సినిమాలో ఉన్న తప్పులు అన్నీఇన్నీ కావు.
తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేసి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బ్రో సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు 30 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.కేతిక శర్మ, ప్రియా వారియర్ లకు ఈ సినిమా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.కేతిక, ప్రియా వారియర్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రియా వారియర్ ఇలాంటి పాత్రలు చేస్తే ఆమె కెరీర్ కు ప్రమాదమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







