Dulkar Salman : మా నాన్న ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు : దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్.( Dulkar salman ) ఓకే బంగారం( OK Bangaram ) అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ఈ నటుడు.

 My Father Warned Me Says Dulkar Salman-TeluguStop.com

మెగా హీరో మమ్ముట్టి వారసుడిగా మలయాళ సినిమా ఇండస్ట్రీ తోనే తన కెరియర్ ప్రారంభించాడు.దశాబ్దం క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోగా సౌత్ ఇండియాలోనే అన్ని భాషల్లో మార్కెట్ ఉన్న నటుడిగా తన కాళ్ళపై తను నిలబడ్డాడు.

నిజానికి తన తండ్రిని కూడా సాధ్యం కాని స్థాయిలో ప్రస్తుతం దుల్కర్ అభిమానులను సంపాదించుకున్నాడు.తెలుగు విషయానికొస్తే ఓకే బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ మహానటి సినిమాలో సావిత్రి భర్త పాత్రలో నటించడంతో అందరూ దుల్కర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత సీతారామన్ సినిమా అతడికి తెలుగు నటుడిగా మారిపోయేంత ఫేమ్ ని కల్పించింది.

Telugu Allu Arjun, Bollywood, Dulkar Salman, Mammootty, Bangaram, Tollywood-Movi

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ గన్స్ అండ్ గులాబ్స్, కింగ్ ఆఫ్ కోట వంటి ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్లలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.అయితే మలయాళం లోనే కాదు హిందీలో తెలుగులో నేరుగా సినిమాలు తీస్తున్నాడు ఇక మలయాళం లో మాత్రం నిర్మాతగా కూడా కొనసాగుతున్నాడు.తన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను సైతం బయట పెట్టాడు ఈ నలభై ఏళ్ల నటుడు.మమ్ముట్టి సైతం హీరోగా కొనసాగుతున్న ఈ తరుణంలో ఏడాదికి నాలుగు సినిమాల వరకు తీస్తున్నాడు కానీ తన తండ్రితో పోలిస్తే తాను కేవలం రెండు మాత్రమే తీయగలుగుతున్నానని ఇక ఒక సినిమా తీయగలిగే రోజు వచ్చిన రోజు ఇంటికి రావద్దు అంటూ తన తండ్రి వార్నింగ్ ఇచ్చాడంటూ సరదాగా చెప్పాడు దుల్కర్.

Telugu Allu Arjun, Bollywood, Dulkar Salman, Mammootty, Bangaram, Tollywood-Movi

తన భార్య అసూమా సైతం తనను ఏ రోజు హీరోగా చూడలేదని అందరి భర్తల్లాగే తాను కూడా ఏదో జాబ్ కి వెళ్లి వస్తున్నట్లుగా అతను నన్ను భావిస్తుందని ఒక్కోసారి తాను నటుడుని అని ఆమె ముందు నిరూపించుకోవాల్సి కూడా వస్తుందంటూ చెప్తున్నాడు భవిష్యత్తులో అన్ని భాషల్లో నిర్మాతగా మారాలనేది దుల్కర్ యొక్క కోరికగా ఉందట ఇక గ్యాంగ్ స్టార్ సినిమాలకు ప్రస్తుతం ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాడు దుల్కర్ సల్మాన్ తను నడుస్తున్న ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు కూడా అలాంటి గ్యాంగ్ స్టార్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నాయి.ఇక తెలుగులో వైజయంతి మూవీస్ బ్యానర్ లో మరో సినిమా కూడా ఒప్పుకున్నాడట.దుల్కర్ సల్మాన్ ఒక్కోసారి తన స్టైలింగ్ విషయంలో అల్లు అర్జున్ ( Allu Arjun )ని కూడా డామినేట్ చేస్తూ ఉంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube