ఇటీవల చిన్న వయస్సులోనే చాలామంది రోగాల బారిన పడుతున్నారు.చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురై ఏ పని చేయలేకపోతున్నారు.
ఇక మరికొంతమంది యువకులకు ఆరోగ్యం బాగానే ఉన్నా పనిచేయడం ఇష్టం లేక సొమరిపోతుల్లా తయారవుతున్నారు.అయితే ఒక పెద్దాయన మాత్రం ఈ వయస్సులోనూ కష్టపడి పనిచేస్తున్నారు.
తన కాళ్లపై తాను నిలబడి ఇప్పటికీ డబ్బులు సంపాదిస్తున్నాడు.సమోసాలను విక్రయిస్తూ ఇంత పెద్ద వయస్సులో కూడా పనిచేస్తున్నాడు.

ఉదయ్ పూర్( Udaipur ) లోని కోర్టు సర్కిల్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వల్ల ఒక పెద్దాయన సమోసాలను అమ్ముతున్నాడు.జోరుగా వర్షం పడుతుండగా.ఆ సమయంలోనూ సమోసాలను విక్రయిస్తున్నాడు.వేడి వేడి సమోసాలతో పాటు పోహ అమ్ముతున్నారు.దీనకి సంబంధించిన వీడియోను ఆర్యాన్ష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
తాను ఉదయ్‌పూర్ కోర్టు సర్కిల్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ పక్కన బైక్ పార్క్ చేస్తుండగా ఈ పెద్దాయన కనిపించినట్లు ఆర్యాన్ష్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.

వయస్సు తగ్గిన తర్వాత ఇంట్లో పిల్లలతో గడుపుతూ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలా సమోసాలను అమ్ముతుండటం చూసి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.వర్షంలో కూడా ఎందుకు ఇంట్లో ఉండకుండా రోడ్డుపై విక్రయిస్తున్నారని అడగ్గా.తాను డబ్బు కోసం పనిచేయడం లేదని, తన మనస్సు ఆనందంగా ఉండేందుకు పనిచేస్తున్నట్లు పెద్దాయన చెప్పుకొచ్చాడు.
తాను తయారుచేసిన ఆహారాన్ని నలుగురు తింటే అదే తనకు సంతోషాన్ని ఇస్తుందని చెబుతున్నాడు.ఈ పోస్ట్ ను ఇప్పటివరకు 12 లక్షల మంది చూశారు.అలాగే లైక్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.ఈ పెద్దయాన స్పూర్తిదాయక స్టోరీని విని అందరూ హ్యాట్సఫ్ చెబుతున్నారు.
ఈ వయస్సులో కూడా ఆయన కష్టపడుతుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.







