దెబ్బ తిన్న రోడ్లు త్వరతగతిన ప్రకృతి విపత్తు నిధులతో బాగు చేసేలా చర్యలు తీసుకుంటాం - ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రం నుండి వేములవాడకు వెళ్లే కల్వర్టు కొదురుపాకకు,మర్ల పేట వెళ్లే దారిలో కల్వర్టు విలాసాగర్ నుండి దేశాయ్ పల్లి , జగ్గారావు పల్లి, వివిధ గ్రామాల్లో రోడ్లు, ఇండ్లు పాక్షికంగా కూలిపోవడం దెబ్బతినడంతో వాటిని శుక్రవారం ఎంపిపి వేణుగోపాల్ , ఎంపీడీవో రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, పంచాయతీరాజ్ ఈ ఈ , డి ఈ,లతో కలిసి పరిశీలించారు.ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ భారీ వర్షాలతో గ్రామాలలో ఇటీవల వేసిన పొలాలు దెబ్బతినడం జరిగిందని

 Actions Will Be Taken To Repair The Damaged Roads Mpp Parlapalli Venugopal, Rep-TeluguStop.com

గతంలో కల్వర్టులకు మరమ్మత్తులు చేసినా కానీ దెబ్బతినడంతో పంచాయతీరాజ్ ఈ ఈ సమక్షంలో పరిశీలించి కల్వర్టు నిర్మాణాలకు నివేదికను మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ ఆరోగ్యశాఖ అధికారులు వర్షాలలో సేవలు అందించిన దుకు అభినందించారు .ఆరోగ్య శాఖ వారు వర్షాల దృశ్య గ్రామాలలో అంటూ వ్యాధులు, జ్వరాలు వచ్చే పరిస్థితులు ఉన్నందున ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరుగుతూ సమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ ,సేస్ డైరెక్టర్ సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య,వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య పంచాయతీరాజ్ డిఇ, ఈ ఈ, ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube