దెబ్బ తిన్న రోడ్లు త్వరతగతిన ప్రకృతి విపత్తు నిధులతో బాగు చేసేలా చర్యలు తీసుకుంటాం – ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రం నుండి వేములవాడకు వెళ్లే కల్వర్టు కొదురుపాకకు,మర్ల పేట వెళ్లే దారిలో కల్వర్టు విలాసాగర్ నుండి దేశాయ్ పల్లి , జగ్గారావు పల్లి, వివిధ గ్రామాల్లో రోడ్లు, ఇండ్లు పాక్షికంగా కూలిపోవడం దెబ్బతినడంతో వాటిని శుక్రవారం ఎంపిపి వేణుగోపాల్ , ఎంపీడీవో రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, పంచాయతీరాజ్ ఈ ఈ , డి ఈ,లతో కలిసి పరిశీలించారు.

ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ భారీ వర్షాలతో గ్రామాలలో ఇటీవల వేసిన పొలాలు దెబ్బతినడం జరిగిందని గతంలో కల్వర్టులకు మరమ్మత్తులు చేసినా కానీ దెబ్బతినడంతో పంచాయతీరాజ్ ఈ ఈ సమక్షంలో పరిశీలించి కల్వర్టు నిర్మాణాలకు నివేదికను మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ ఆరోగ్యశాఖ అధికారులు వర్షాలలో సేవలు అందించిన దుకు అభినందించారు .

ఆరోగ్య శాఖ వారు వర్షాల దృశ్య గ్రామాలలో అంటూ వ్యాధులు, జ్వరాలు వచ్చే పరిస్థితులు ఉన్నందున ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరుగుతూ సమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్ ,సేస్ డైరెక్టర్ సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య,వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య పంచాయతీరాజ్ డిఇ, ఈ ఈ, ఎంపీడీవో నల్ల రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

విద్యార్థులతో కలిసి మాస్ స్టెప్పులు వేసిన నితిన్, శ్రీలీల.. వీడియో వైరల్