తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ మేరకు చెరుకు సుధాకర్ మరియు శ్రావణ్ కుమార్ లు పిల్ దాఖలు చేశారు.
ఈ పిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం వరద బాధితులకు ఎలాంటి ఆసరా కల్పిస్తున్నారని ప్రశ్నించింది.ఎన్నికల కోసం వార్ రూమ్ లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వరదల కోసం కంట్రోల్ రూమ్ లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలోనే వరదల్లో చిక్కుకున్న వారి కోసం తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించింది.అదేవిధంగా కడెం ప్రాజెక్టు సెఫ్టీ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పింది.
ఇప్పటివరకు వరదలకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో దానిపై సోమవారం కల్లా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.







