జార్ఖండ్ లో దారుణం.. యువతిని నగ్నంగా చెట్టుకు కట్టేసి ఏం చేశారంటే..?

యువతికి తాను ప్రేమించిన ప్రేమనే శాపంగా మారింది.ప్రియుడి కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడు( Boyfriend ) కూడా ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా హింసించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నగ్నంగా చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు.

 Jharkhand Woman Stripped Tied To Tree Over Love Affair Details, Jharkhand, Woman-TeluguStop.com

అయితే పోలీసులకు సమాచారం అందడంతో ఆ అమ్మాయి ను రక్షించి వైద్యం నిమిత్తం సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించారు.అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలను చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.జార్ఖండ్ రాష్ట్రంలోని( Jharkhand ) గిరిధి జిల్లా లోని సారియా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 26 ఏళ్ల యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది.

ఈ ప్రేమ వ్యవహారం ఆ యువకుడి కుటుంబ సభ్యులకు తెలిసింది.యువకుడి తల్లిదండ్రులతో పాటు సవతి తల్లి ఆ యువకుడిని మందలించి, ఆ యువతిని ఇంటికి పిలవమన్నారు.

Telugu Boyfriend, Jharkhand, Love, Lover, Tied Tree, Stripped-Latest News - Telu

ఆ యువకుడు తమ కుటుంబ సభ్యులు చెప్పిన విధంగానే ఆ యువతిని( Women ) ఇంటికి రావాలని కోరాడు.ప్రియుడి మాటలు కాదన లేకపోయినా ఆ యువతి ఎంతో సంతోషంగా ప్రియుడు ఇంటికి వచ్చింది.అయితే ప్రియుడితోపాటు అతని కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక్కసారిగా ఆ యువతిపై విచక్షణారహితంగా దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండే అడవికి తీసుకువెళ్లి,

Telugu Boyfriend, Jharkhand, Love, Lover, Tied Tree, Stripped-Latest News - Telu

ఆ యువతి బట్టలను పూర్తిగా చించి చెట్టుకు కట్టేసి చాలా ఘోరంగా అవమానించి విచక్షణ రహితంగా కొట్టారు.అవమాన భారంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది అని భావించి ప్రియుడు, అతని కుటుంబ సభ్యులు ఆ యువతిని అక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్లి పోయారు.పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

బాధిత యువతి ప్రియుడిని, అతని తండ్రిని, తల్లిని, సవతి తల్లిని అరెస్ట్ చేసినట్లు బాగోడార్ షబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ నౌషాద్ అలామ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube