మల్లారెడ్డికి షాక్.. కే‌సి‌ఆర్ ప్లాన్ అదే ?

తెలంగాణలో మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సి‌ఎం గా రికార్డ్ సృష్టించాలని కే‌సి‌ఆర్ పట్టుదలగా ఉన్నారు.

 A Shock To Mallareddy.. Is Kcr's Plan The Same Tdp Party, Mallareddy., Cm Kcr,-TeluguStop.com

అయితే గత రెండు సార్లతో పోల్చితే ఈసారి బి‌ఆర్‌ఎస్ ( BRS party )కు గెలుపు అంతా తేలికైన విషయం కాదు.ఈ విషయం కే‌సి‌ఆర్ కు కూడా బాగా తెలుసు.

అందుకే ఈసారి బరిలో దిగే స్థానాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు.ముఖ్యంగా బి‌ఆర్‌ఎస్ బలహీన సీట్లపై కే‌సి‌ఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి నల్గొండ, వరంగల్ లోని కొన్ని నియోజిక వర్గాలలో మరికొన్ని నియోజిక వర్గాలలో బి‌ఆర్‌ఎస్ కొంత బలహీనంగా ఉంది.

Telugu Brs, Cm Kcr, Malla, Tdp, Telangana-Politics

అందుకే నియోజిక వర్గాల వారీగా పార్టీ బలాబలహీనతలపై గులాబీ బాస్ దృష్టి పెట్టరాట.బలహీన స్థానాలలో సరైన వ్యక్తులను బరిలో నిలిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారట.ఈ నేపథ్యంలోనే తాను పోటీ చేసే స్థానం విషయంలో కూడా కే‌సి‌ఆర్( CM kcr ) ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఇంతవరకు ఆయన గజ్వేల్ నుంచి బరిలో దిగుతూ వచ్చారు.

కానీ ఈసారి మాత్రం బి‌ఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న కామారెడ్డి, పెద్దపల్లి వంటి నియోజిక వర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి.ఇప్పుడు మరో నియోజిక వర్గం మేడ్చల్ పేరు కూడా వినిపిస్తోంది.

Telugu Brs, Cm Kcr, Malla, Tdp, Telangana-Politics

ఈ నియోజిక వర్గానికి మంత్రి మల్లారెడ్డి ( Mallareddy )ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం ఆయనపై నియోజిక వర్గంలో వ్యతిరేక గళం వినిపిస్తోందట.అంతే కాకుండా ఐటీ దాడులు కూడా మల్లారెడ్డిపై కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి.

దాంతో ఈసారి మేడ్చల్ లో మల్లారెడ్డికి ఓటమి తప్పదనే వాదన వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కాకుండా మేడ్చల్ నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కే‌సి‌ఆర్ ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి.

ఒకవేళ ఇదే గనుక నిజం అయితే మల్లారెడ్డికి ఎంకేదైన సీటు కేటాయిస్తారా ? లేదా ఆయనకు ప్రదాన్యత తగ్గిస్తారా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube