'జైలర్' నార్త్ ప్రమోషన్స్ కోసం మిల్కీ బ్యూటీ.. మేకర్స్ ప్లాన్ పక్కా హిట్!

సూపర్ స్టార్ రజనీ కాంత్ 9 Rajinikanth )చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ”జైలర్”.

 Tamannaah Bhatia For Jailer's Bollywood Promotions, Rajinikanth, Jailer Movie,-TeluguStop.com

( Jailer Movie ).ఈ సినిమాకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత హైప్ నెలకొంది.సూపర్ స్టార్ లుక్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేయడంతో ఈ సినిమాపై మరింత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఇది పాన్ ఇండియన్ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.అయితే తమిళ్, తెలుగు వంటి సౌత్ భాషల్లో రజనీకాంత్ పేరు చెప్పి ప్రమోషన్స్ చేస్తారు.

కానీ బాలీవుడ్ లో మాత్రం కేవలం సూపర్ స్టార్ పేరు మాత్రమే వర్కౌట్ అవ్వదు.

అందుకే మిల్కీ బ్యూటీని మేకర్స్ రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది.ఎలాగూ ఈ మధ్య తమన్నా వరుస వెబ్ సిరీస్ లతో మంచి పాపులర్ అయ్యింది.దీంతో అక్కడ నార్త్ లో ఈ భామనే ప్రమోషన్స్ చేయబోతుంది అని టాక్.

అమ్మడు ఎలాగూ అక్కడ ఫేమస్ అయ్యింది కాబట్టి మేకర్స్ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు.ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక రోల్స్ లో నటిస్తున్నారు.పాన్ ఇండియా కావడంతో నటీనటులను వివిధ భాషల్లో వారిని సెలెక్ట్ చేసి పక్క ప్లాన్ తో నెల్సన్ తెరకెక్కించారు.

ఆగస్టు 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా చిరు భోళా శంకర్( Bhola Shankar )కు పోటీగా రిలీజ్ కాబోతుంది.మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube