బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా మహిళలను ఈడీ విచారణకు పిలవడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ చేసిన ధర్మాసనం ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా రెండు వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది.







