సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులంతా తమ వ్యక్తిగత విషయంలో తాము తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.ముఖ్యంగా తమ ప్రేమ, పెళ్లిల విషయంలో కొన్ని నిర్ణయాలు సులువుగా తీసుకుంటారు.
ఏదైనా గొడవలు వస్తే కాంప్రమైజ్ అనేది లేకుండా వెంటనే బ్రేకప్ చెప్పుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు తమన్నా కూడా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిందన్న న్యూస్ బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా( Tamannaah Bhatia ) వ్యక్తిగత విషయాలు బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది.కేవలం టాలీవుడ్ అనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా స్టార్ హోదాకు చేరుకుంది.
చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోలతో, సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది.కొత్త హీరోయిన్స్ వచ్చినప్పటికి కూడా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గదు.
అవకాశాలు కూడా బాగా వస్తుంటాయి.ఇక అందం విషయంలో ఈ బ్యూటీ చాలా కేరింగ్ తీసుకుంటుంది.
ఇక ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.కానీ గత కొన్ని రోజుల నుండి ఈమె బాలీవుడ్ హీరో విజయ్ వర్మతో ప్రేమలో ఉందని.
అతనితో డేటింగ్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తన ప్రేమ విషయాన్ని కూడా తమన్నా గతంలో మీడియా ముందు చెప్పుకొచ్చింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా అతనికి ఈ బ్యూటీ బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు బాలీవుడ్( Bollywood ) లో సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు వివాదాలతో తట్టి లేపే బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు తమన్న బ్రేకప్ చెప్పుకుంటుంది అన్న విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
ప్రతి విషయానికి విజయ్ వర్మ తమన్నాకు( Vijay Verma ) బాగా కండిషన్స్ పెడుతున్నాడని.అంతేకాకుండా తనను బాగా ఫాలో చేస్తున్నాడని.పైగా తన మొబైల్ కూడా చెక్ చేస్తూ వస్తున్నాడని.
దీంతో అతని ప్రవర్తన నచ్చకపోవటంతో తమన్నా అతనికి బ్రేకప్ చెప్పిందని పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అవ్వడంతో అతనిపై జనాలు బాగా ఫైర్ అవుతున్నారు.
ఎప్పుడూ ఇతరుల విషయాల గురించి తప్ప నీ గురించి నువ్వు చూసుకోవా.కలిసున్న వాళ్ళను కూడా నీ కామెంట్లతో విడగొట్టేలాగా ఉన్నావు అంటూ ఫైర్ అవుతున్నారు.
మరీ ఈ విషయం గురించి తమన్నా, విజయ్ ఏమని స్పందిస్తారో చూడాలి.ఒకవేళ వారు నిజంగానే బ్రేకప్ అవుతున్నారని తెలిస్తే తమ అభిమానులు మాత్రం తట్టుకోలేరని చెప్పాలి.
పైగా రీసెంట్ గానే తను చేసిన వెబ్ సిరీస్ సమయంలోనే తమన్నా ఈ విషయం ఓపెన్ గా చెప్పడం కూడా వైరల్ అయింది కాబట్టి ఇప్పుడు బ్రేకప్ ది కూడా నిజమే అయితే తమన్నా కెరీర్ కు అడ్డంకులు ఎదురవుతాయని చెప్పవచ్చు.