వన్డే మ్యాచ్లో కుల్దీప్ యాదవ్- జడేజా తోలి జోడిగా సరికొత్త రికార్డు..!

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు( Kuldeep Yadav ) వెస్టిండీస్ బ్యాటర్లపై విరుచుకుపడ్డారు.ఇద్దరు కలిసి ఏకంగా ఏడు వికెట్లు తీశారు.

 Kuldeep Yadav-jadeja Set A New Record In Odi Match..! , Kuldeep Yadav , Ravind-TeluguStop.com

కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో ఆరు పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.రవీంద్ర జడేజా ఆరు ఓవర్లకు 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

దీంతో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఒకే మ్యాచ్లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లుగా కుల్దీప్- రవీంద్ర జడేజాల జోడి అవతరించింది.ఈ ఇద్దరితోపాటు మిగతా బౌలర్లు కూడా రాణించడంతో వెస్టిండీస్ జట్టు 23 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.

స్వల్ప లక్ష్య చేదనకు దిగిన భారత జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 22.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.ఓపెనర్ ఇషాన్ కిషన్( Ishan Kishan ) 52 అర్థ సెంచరీ తో అదరగొట్టాడు.ఇక మరో ఓపెనర్ అయిన శుబ్ మన్ గిల్( Shubman Gill ) ఏడు పరుగులతో మళ్లీ నిరాశపరిచాడు.

సూర్య కుమార్ యాదవ్ 19 పరుగులు, హర్థిక్ పాండ్య 5, రవీంద్ర జడేజా 16, సార్థూల్ ఠాగూర్ 1, రోహిత్ శర్మ 12 పరుగులు చేశారు.

అయితే ఈ విజయంపై భారత క్రికెట్ అభిమానులు కాస్త అసంతృప్తి గానే ఉన్నారు.స్వల్ప లక్ష్యాన్ని చేదించడం కోసం భారత్ ఏకంగా ఐదు వికెట్లు కోల్పోవడం కాస్త బాధగా అనిపించిందని సోషల్ మీడియా వేదికగా పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.కుల్దీప్ యాదవ్- రవీంద్ర జడేజా లు రాణించడం వల్లే భారత్ మ్యాచ్ గెలిచిందని, లేదంటే వెస్టిండీస్ భారీ స్కోరు చేసి ఉండేదని, స్వల్ప లక్ష్యాన్ని చేదించడం కోసం ఐదు వికెట్లు కోల్పోయింది భారీ లక్ష్యం చేదించాలంటే చాలా కష్టమయ్యేదని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube