దురదృష్టం అంటే ఇదేనేమో..99 పరుగులు కొట్టి నోటౌట్ గా మిగిలిన ఆటగాళ్ళు వీళ్లే..!

క్రికెటర్ లో 99 పరుగులు( 99 Runs ) చేసి అవుటైతే ఆ ఆటగాడి బాధ మాటల్లో వర్ణించలేం.ఒకవేళ 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచి సెంచరీకి కావాల్సిన మరో ఒక్క పరుగు చేయలేకపోతే ఆ ఆటగాడికి దురదృష్టం వెక్కిరించినట్టే.

 Cricketers Out At 99 Runs Steve Waugh Misbah Pollock Bairstow Details, Cricketer-TeluguStop.com

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా బ్యాట్స్ మెన్ సెంచరీ చేయాలని కోరుకుంటాడు.అయితే తాజాగా యాషెస్ సిరీస్ లో భాగంగా జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో( Bairstow ) 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.

అయితే క్రీజులో ఉన్న జేమ్స్ అండర్సన్ చివరి వికెట్ గా వెనుదిరగడంతో సెంచరీకి ఒక్క పరుగు తేడాతో బెయిర్ స్టో 99 పరుగులతో నోటౌట్ గా మిగిలి పోవాల్సి వచ్చింది.దీంతో సెంచరీ మిస్ అయ్యింది.

అయితే 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి సెంచరీ మిస్ చేసుకున్న దురదృష్టవంతులు ఎవరో చూద్దాం.

Telugu Alex Tudor, Andrew Hall, Ashes, Cricketers, Johnny Bairstow, Misbah Ul Ha

స్టీవ్ వా:

1994లో యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ లో స్టీవ్( Steve Waugh ) 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా మిగిలిపోయాడు.అయితే క్రీజూలో ఉన్న మెక్ డెర్మట్ అవుట్ అవడంతో స్టీవ్ కు ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయింది.

Telugu Alex Tudor, Andrew Hall, Ashes, Cricketers, Johnny Bairstow, Misbah Ul Ha

షాన్ పోలాక్:

2002లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆటగాడైన షాక్ పొలాక్( Shaun Pollock ) 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా మిగిలిపోయాడు.క్రీజూలో ఉన్న మఖయ ఎన్తిని అవుట్ కావడంతో షాన్ పోలాక్ సెంచరీ మిస్సయింది.ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవడంతో షాన్ పొలాక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Telugu Alex Tudor, Andrew Hall, Ashes, Cricketers, Johnny Bairstow, Misbah Ul Ha

ఆండ్రూ హాల్:

సౌత్ ఆఫ్రికా ఆటగాడైన అండ్రు హాల్( Andrew Hall ) ఇంగ్లాండ్తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్లో 99 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.అప్పుడు క్రీజులో ఉన్న డెవాల్డ్ ప్రిటోరియస్ అవుట్ కావడంతో ఆండ్రూ హాల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Telugu Alex Tudor, Andrew Hall, Ashes, Cricketers, Johnny Bairstow, Misbah Ul Ha

అలెక్స్ టుడోర్:

ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన అలెక్స్ టుడోర్( Alex Tudor ) న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 99 పరుగులతో నాటౌట్ గా మిగిలిపోయాడు.అయితే చివరి బంతికి సిక్స్ కొట్టి ఉండినట్లయితే సెంచరీ పూర్తయింది కానీ ఫోర్ కొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.దీంతో 99 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Telugu Alex Tudor, Andrew Hall, Ashes, Cricketers, Johnny Bairstow, Misbah Ul Ha

మిస్బావుల్ హక్:

పాకిస్తాన్ ప్లేయర్ అయిన మిస్బావుల్ హక్( Misbah Ul Haq ) వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్లో 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా మిగిలిపోయాడు.అప్పుడు క్రీజ్ లో ఉన్న అబ్బాస్ అవుట్ కావడంతో మిస్బావుల్ హాక్ 99 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube