ఇండియన్ 2 కోసం మేకర్స్ భారీ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్( Kamal haasan ) ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమా( Vikram movie )తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లోకి రావడంతో అదే ఊపులో రెండేళ్ల క్రితం ఆగిపోయిన ‘ఇండియన్ 2’ సినిమాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ ఏడాది సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు.రెండేళ్ల క్రితం ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ అనేక కారణాల వల్ల రెండేళ్ల పటు వాయిదా పడింది.

 Indian 2 Team Takes A Key Decision After Obtaining Six Hours Of Footage , Kamal-TeluguStop.com

భారతీయుడు సినిమా( Indian 2 )కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.అప్పట్లో శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కిన భారతీయుడు ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే ఇన్నేళ్ల తర్వాత ఇదే కాంబోలో సీక్వెల్ వస్తుంది అంటే ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు.తాజాగా ఈ సినిమా కోసం మేకర్స్ భారీ ప్లాన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను మేకర్స్ 6 గంటల ఫుటేజ్ చిత్రీకరించారని అందుకే ఇండియన్ 2 సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.ఇండియన్ 2 లో సబ్ ఫ్లాట్ లు చాలా ఉన్నాయని ఇది మరో భాగంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్.

మరి ఇందులో నిజమెంతో అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలిమ్స్ సంయుక్తంగా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.కాజల్ అగర్వాల్,( Kajal Agarwal ) రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మరి రిలీజ్ వచ్చే ఏడాది ఉంటుంది అని అంటున్నారు.చూడాలి రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube