ఇటీవలే కాలంలో ప్రేమించానని వెంట పడడం, ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవరకు రకరకాలుగా వేధించడం, ఎంత వేధించిన ప్రేమకు అంగీకారం తెలుపకపోతే ప్రేమోన్మాదులు ఎంతటి దారుణాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు.తాజాగా ఓ యువకుడు ప్రేమోన్మాది గా మారి ఇంట్లో నిద్రిస్తున్న తాత, తల్లి ( Grandfather , mother )పై దాడి చేసి ప్రేమించిన యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు.
ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకినీడు మండలం సిద్దాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.సిద్దాపురం గ్రామంలో ( Siddapuram village )వృద్ధ దంపతులు నివాస ఉంటున్నారు.ఈమధ్య వృద్ధుని భార్య కు అనారోగ్యం కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
వృద్ధుడికి భార్యకు సేవలు చేయడం,ఇంటి పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో ఏలూరులో ఉంటున్న కుమార్తె తన కూతురుతో కలిసి పుట్టింటికి వచ్చి తన వృద్ధ తండ్రికి ఆసరాగా ఉంటుంది.
గతంలో ఆ వృద్ధుడి మనవరాలిని ప్రేమ పేరుతో షేక్ ఇమ్రాన్( Sheikh Imran ) అనే యువకుడు వెంటపడుతు పలుమార్లు వేధించడంతో చాలా సార్లు గొడవలు కూడా జరిగాయి.తాజాగా మంగళవారం తెల్లవారుజామున షేక్ ఇమ్రాన్ ఆ వృద్ధుడి ఇంటికి వచ్చాడు.ఇంటి బయట బల్ల మీద నిద్రిస్తున్న యువతి తాత పై ఇనుపరాడుతో తలపై బలంగా కొట్టాడు.
వెంటనే ఆ వృద్ధుడు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె బయటకు వచ్చింది ఆమెపై కూడా షేక్ ఇమ్రాన్ ఇనుపరాడుతో దాడి చేశాడు.తల్లి, తాత కేకలు ఆ యువతి బయటకు రావడంతో తనతో పాటు రాకపోతే తల్లి, తాత లను చంపేస్తానని షేక్ ఇమ్రాన్ బెదిరించి, ఆ యువతిని బలవంతంగా తన బైక్ పై ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
వీరి కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ వృద్ధుడిని, అతని కూతురిని ఆసుపత్రికి తరలించారు.వృద్ధుడి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని షేక్ ఇమ్రాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.