సినిమాల కోసం అమెరికాలో భర్తను వదిలేసి వచ్చాను.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో ప్రమోదిని ( Pramodini )ఒకరు కాగా ఈ ప్రముఖ నటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.సినిమాల కోసం అమెరికాలో భర్తను వదిలేసి వచ్చానని ఆమె చెప్పుకొచ్చారు.

 Actress Pramodini Comments About Her Husband Details Here Goes Viral In Social-TeluguStop.com

మా కాలంలో నోకియా పెద్ద మొబైల్ ఉండేదని అప్పుడు ఔట్ గోయింగ్, ఇన్ కమింగ్ కు కూడా ఛార్జీలు ఉండేవరని ప్రమోదిని అన్నారు.

Telugu Architect, Pramodini, Tollywood, Tv Serial-Movie

మేము మొత్తం నలుగురమని ఆమె కామెంట్లు చేశారు.నేను పెళ్లి జరిగిన వెంటనే అమెరికాకు వెళ్లిపోయానని నాకు ఒకే పాప అని ప్రమోదిని తెలిపారు.నా కూతురు ఇంటర్ చదువుతోందని ఆమె అన్నారు.

చిన్నప్పటి నుంచి నేను సినిమాలు చేస్తున్నానని పెళ్లయ్యాక ఇండస్ట్రీని మిస్ అవుతానని అనుకోలేదని ప్రమోదిని చెప్పుకొచ్చారు.పెళ్లి తర్వాత నచ్చిన ప్రొఫెషన్ ను మిస్ చేసుకుంటున్నానని అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

Telugu Architect, Pramodini, Tollywood, Tv Serial-Movie

అమెరికా అబ్బాయిని ఎందుకు చేసుకున్నానని అనిపించిందని ప్రమోదిని తెలిపారు.ఏం చేసినా నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదని ప్రమోదిని వెల్లడించారు.నా భర్త చదివిస్తానని చెప్పినా నాకు ఆసక్తి లేదని అన్నానని ఆమె పేర్కొన్నారు.అప్పుడు సోషల్ మీడియా( Social media ) లేదని, రీల్స్ లేవని ప్రమోదిని అన్నారు.

నా భర్త హోమ్ థియేటర్ ఆర్కిటెక్ట్( Architect ) అని ప్రమోదిని వెల్లడించారు.నేను వెళ్లిపోవాలని అనుకుంటున్నానని భర్తకు చెప్పి ఒప్పించి పాపను తీసుకొని వచ్చానని ఆమె అన్నారు.

నీ ఇష్టమే నా ఇష్టం అని భర్త చెప్పారని ఆమె పేర్కొన్నారు.ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కు నేను ఇండియాకు వచ్చానని చెప్పిన వెంటనే సినిమాలు, టీవీ సీరియల్ ఆఫర్లు వచ్చాయని ప్రమోదిని కామెంట్లు చేశారు.

నటి ప్రమోదిని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube