ఆ సమయంలో మీరు ఇయర్‌ఫోన్స్ వాడుతారా? అయితే ఇది వినండి!

నేటి యువతకి దాదాపుగా ఇయర్ ఫోన్స్( Earphones ) వాడే అలవాటు బాగా ఉంటుంది.ఇక ఇయర్ ఫోన్స్ వాడడం వలన కొన్ని దుష్పరిణామాలు వుంటాయని నిపుణులు చెప్పినప్పటికీ ఆ అలవాటుని అంత త్వరగా మానుకోలేము.

సాధారణంగా ఇంటిదగ్గర వున్నపుడు, ఆఫీసుల్లో వున్నపుడు వాడితే అంత సమస్య ఉండదు గానీ, ప్రయాణాల్లో వాడడం వలన అనేక రకాలుగా నష్టాలు చేకూరుతాయి.మరీ ముఖ్యంగా వాహనదారులు చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తూ వుంటారు.

అది అంత మంచిది కానేకాదు.మనమేమో డ్రైవింగ్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కాల్ వచ్చేటప్పుడు ఎంచక్కా మాట్లాడుకోవడానికి అనువుగా ఉంటుంది కదాని అనుకుంటాం.

కానీ అది మంచిది కాదు.

Telugu Earphone Tips, Risks, Latest, Road, Tech-Latest News - Telugu

అయితే, ఈ విషయం మనకి ఏదోఒక నష్టం జరిగేవరకు తెలియదు.ఒక్కసారి అనుకోని ప్రమాదం జరిగితే అపుడు అన్నీ గుర్తుకువస్తాయి.మనం చేసిన చిన్న పొరపాటు ఒక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది.

తాజా సర్వేలు ఏం చెబుతున్నాయంటే ఇపుడు జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్( Road accident ) లో దాదాపు ఇలాంటివారి వలెనే జరుగుతున్నాయని సమాచారం.అవును, అలా డ్రైవ్ చేసేటప్పుడు ఏకాగ్రత అనేది పూర్తిగా డ్రైవింగ్ మీద ఉండదు.

ఇలాంటి డ్రైవింగ్ ప్రాణాలతో చెలగాటమే.కానీ హెడ్‌సెట్‌లు, బ్లూటూత్‌లు( Bluetooths ), ఇయర్‌బడ్స్.

టెక్నాలజీ వచ్చిన తరువాత అవి ధరించి డ్రైవింగ్‌ చేసేవాళ్లు ఎక్కువైపోయేవారు.టెక్నాలజీ అనేది మంచికొరకే.

అయితే దానిని ఎలా వాడుకోవాలో నేటి యువతకు తెలియడం లేదు.

Telugu Earphone Tips, Risks, Latest, Road, Tech-Latest News - Telugu

సాధారణంగా మనం చెవులలో ఇలాంటివి పెట్టుకొని డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హారన్‌ కొట్టినా, లేదంటే చుట్టుపక్కల ఏదైనా జరిగినా వెంటనే గుర్తించలేని పరిస్థితి ఉంటుంది.దాంతో ప్రమాదపు అంచుల్లో మనం పయనిస్తూ ఉంటాం.కాబట్టి ఇలాంటి ప్రయాణం అనేది ఎప్పటికీ ఆమోదయోగ్యం కానిది.

అందుకే ఈసారి మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఈ విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకోండి.మీకోసం మీ కుటుంబం ఇంటిదగ్గర వేచి చూస్తూ ఉంటుంది.

ఆచితూచి వ్యవహరించండి.మేరే కాకుండా, ఇలా ఎవరు డ్రైవ్ చేసినా ఉపేక్షించకండి.

జీవితం అనేది ఒక్కసారే వస్తుంది.కోరి ప్రమాదం కొనితెచ్చుకొని అర్దాంతరంగా తనువు చాలిస్తే కొన్ని జీవితాలు తలకిందులు అయిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube