వైరల్: మన చర్మాన్ని కూడా చివరికి ఇలా తయారు చేస్తున్నారా..?!

కొంతమందికి వినూత్న ఆలోచనలు వస్తూ ఉంటాయి.వెరైటీ ఆహార పదార్థాలు, వినూత్న వస్తువులను తయారుచేస్తుండటం మనం సోషల్ మీడియా( Social media )లో చూస్తూ ఉంటాం.

 Viral: Is Our Skin Also Made Like This In The End , Skin, Skin Experiments, Lat-TeluguStop.com

అలాగే వినూన్న విన్యాసాలు, పనులు చేస్తూ చాలామంది వార్తల్లో ఉంటూ ఉంటారు.తాజాగా ఒక మహిళ వినూత్నమైన పని చేసింది.

తన పొట్ట నుంచి తీసిన చర్మంతో లెదర్‌ను తయారుచేయించింది.చర్మాన్ని ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో దానితో లెదర్ వస్తువులను తయారుచేయించింది.

Telugu Katie Taylor, Latest, Skin, Skin Lather-Telugu NRI

యూకేకు చెందిన కేటీ టేలర్( Katie Taylor) అనే 52 ఏళ్ల మహిళ గతంలో అధిక బరువుతో బాధపడింది.రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత డైప్-2 డయాబెటిస్ వచ్చింది.దీంతో ఆమె మరింత బరువు పెరిగింది.అయితే ఆ తర్వాత బరువు తగ్గేందుకు ఆమె అనేక ప్రయత్నాలు చేసింది.కీటో డైట్, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి చేసింది.చివరికి ఎలాగోలా బాగా బరువు తగ్గింది.

బరువు తగ్గడంతో ఆమె శరీరం వదులుగా తయారైంది.దీంతో వదులు చర్మాన్ని ఆపరేషన్ ద్వారా ఆమె తొలగించుకుంది.దాదాపు 1.8 కిలోల ఆమె చర్మాన్ని శస్త్రచికిత్స ద్వారా డాక్టర్లు తొలగించారు.

Telugu Katie Taylor, Latest, Skin, Skin Lather-Telugu NRI

చర్మంతో ఏదోకటి చేయాలనే ఉపాయం ఆమెకు వచ్చింది.దీంతో దానిని లెదర్ వస్తువుగా తయారుచేయించింది.త్వరలో దానిని వేలంలో పెట్టాలని చూస్తోంది.చర్మాన్ని లెదర్( Skin lather ) గా మార్చేందుకు ముందుగా దానిని సెలైన్ ద్రావణంలో ఉంచింది.తొమ్మిది నెలలు ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత చర్మంలోని కొవ్వును వేరు చేశారు.తర్వాత తోలుును లెదర్ గా మార్చే ద్రావణంలో నానబెట్టారు.

చివరకు ఆమె చర్మం లెదర్ వస్తువుగా మారిపోయింది.చర్మంతో తయారుచేసిన ఈ వస్తువుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంతమంది ఈమె ఉపాయాన్ని మెచ్చుకుంటున్నారు.చాలా కష్టపడి బరువు తగ్గిందని, దీంతో జీవితకాలం దానిని గుర్తు పెట్టేందుకు ఇలా చేసిందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube