మన బర్త్ డేను స్నేహితులు ఘనంగా సెలబ్రేట్ చేయడం మనం చూస్తూ ఉంటాం.స్నేహితులు మనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు.
అలాగే మనం స్నేహితులకు దావత్ ఇచ్చి వారితో కలిసి హాయిగా బర్త్ డేను జరుపుకుంటాం.ఇక కొన్ని ఆఫీసుల్లో అయితే కంపెనీవారు ఉద్యోగుల బర్త్ డేను సెలబ్రెట్ చేస్తారు.
ఉద్యోగితో కేక్ కట్ చేయించి బర్త్ డే( Birthday celebrations)ను సెలబ్రేట్ చేస్తారు.ఇప్పుడు ఒక 64 ఏళ్ల ఉద్యోగికి కూడా తోటి సిబ్బంది అలాగే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

లియో( Leo ) అనే 64 ఏళ్ల వ్యక్తి న్యూఢిల్లీ( New Delhi)లోని ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు.ఆయన బర్త్ డే సందర్భంగా తోటి సిబ్బంది స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు.కొన్నేళ్లుగా ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోలేదని, కేక్ కట్ చేయలేదని సిబ్బంది తెలుసుకున్నారు.దీంతో బర్త్ డే రోజున ఆయనకు సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.
కేక్ కట్ చేయించి ఆయన బర్త్ డేను సెలబ్రేట్ చేశారు.దీంతో ఆయన భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో లియోతో కేక్ కట్ చేయించి బర్త్ డే సాంగ్ ఆలపించారు.దీంతో ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.మేజికల్లీ న్యూస్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు.
దీంతో వీడియో కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.తోటి సిబ్బంది తనకు బర్త్ డే రోజున ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వడంతో లియో చాలా ఆనందపడ్డాడు.
ఆనందభాష్పాలతో వారికి థ్యాంక్స్ చెప్పాడు.ఇలాంటి చిన్న విషయాలే జీవితంలో గుర్తుండిపోతాయని నెటిజన్లు అంటున్నారు.
ఆయన కళ్లల్లో ఆ ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







