టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర (Devara) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎన్టీఆర్ 2011 మే 5వ తేదీ లక్ష్మీ ప్రణతి (Lakshmi Pranathi) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి నార్నే శ్రీనివాస్ రావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.అయితే తాజాగా వీరి వివాహం వేడుక గురించి ఓ వార్త వైరల్ గా మారింది.వీరి వివాహ వేడుకలలో భాగంగా లక్ష్మీ ప్రణతి ధరించిన చీర(Wedding Saree) ఖరీదు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ చీర ఖరీదు ఏకంగా కోటి రూపాయలు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ చీర ఇంత ధర పలకడానికి కారణం లేకపోలేదు ఈ చీర బంగారు వెండి తీగలతో తయారు చేసినదని తెలుస్తోంది.

తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ప్రణతి ధరించిన కంజీవరం చీరలో( Kanjeevaram Saree ) పెళ్లి వేడుకలలో పాల్గొన్నారు.ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ చీర కోటి రూపాయలు అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు.ఇక ఎన్టీఆర్ సైతం పెళ్లిలో పట్టు వస్త్రాలను ధరించి ఉన్నారు.ఇలా వీరి పెళ్లి వేడుకలలో ప్రణతి ధరించిన ఈ చీర ఖరీదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.2011వ సంవత్సరంలో వివాహం చేసుకున్నటువంటి ఈ జంట 2014వ సంవత్సరంలో అభయ్ రామ్(Abhay Ram) కి జన్మనిచ్చారు.2019లో భార్గవ్ రామ్ (Bhargav Ram) జన్మించారు.ప్రస్తుతం ప్రణతి తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉండగా ఎన్టీఆర్ మాత్రం సినిమాలపై ఫోకస్ చేసి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.







