తెలంగాణలో రేపటి నుంచి రైతు వద్దకు బీజేపీ కార్యక్రమం జరగనుంది.ఇందులో భాగంగా వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రైతులకు సంక్షేమ పథకాలను వివరిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.







