జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సున్నిత మనస్కుడు అనే సంగతి తెలిసిందే.తన సన్నిహితులకు ఎలాంటి కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ తట్టుకోలేరు.
మెగా కుటుంబంలో సాయితేజ్ అంటే పవన్ కు ప్రత్యేక అభిమానం ఉంది.సాయితేజ్ కెరీర్ పరంగా సక్సెస్ కావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.
సాయితేజ్ యాక్సిడెంట్ గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సాయితేజ్ ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ పై ఉన్నాడంటే ప్రమాదం జరిగిన సమయంలో కాపాడిన అబ్దుల్ కారణమని పవన్ అన్నారు.అబ్దుల్ కు కృతజ్ఞతలు చెబుతూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.తేజ్ కు చికిత్స అందించిన అపోలో, మెడికవర్ ఆస్పత్రి వర్గాలకు కృతజ్ఞతలు అని పవన్ చెప్పుకొచ్చారు.
సాయితేజ్ కు యాక్సిడెంట్( Sai Dharam Tej ) అయిన సమయంలో ఒక మూలన కూర్చుని ఏడ్చానని ఆయన తెలిపారు.
బ్రో మూవీ ఓకే చేసే సమయంలో సాయితేజ్ కు యాక్సిడెంట్ అయిందని చిన్న యాక్సిడెంట్ ఇంకో గంటలో వస్తాడని నేను అనుకున్నానని పవన్ పేర్కొన్నారు.పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారని చూస్తున్నారని కానీ ఏమీ చెప్పలేకపోతున్నారని ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో గుళ్లకు వెళ్లి పూజలు, వ్రతాలు చేయలేమని సాయితేజ్ ను కాపాడాలని నేను పూజించే దేవతను కోరుకున్నానని పవన్ అన్నారు.
బ్రో మూవీ షూట్ సమయంలో డైలాగ్స్ చెప్పడం రాక సాయితేజ్ చాలా ఇబ్బంది పడ్డాడని దర్శకుడు సముద్రఖని సాయితేజ్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకుని డైలాగ్స్ చెప్పించాడని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతోంది.