చిన్నపిల్లలు చేసే అల్లరి, చిలిపి చేష్టలు చాలా సరదాగా ఉంటాయి.ఏమీ తెలియని వయస్సులో చిన్నారులు చేసే పనులు నవ్వు తెప్పిస్తాయి.
చిన్నపిల్లలు ఎదిగే సమయంలో ఏ పని చేసినా చూడటానికి సరదాగా ఉంటుంది.అలాగే వాళ్లు ఏం పనిచేసినా ఆసక్తికరంగా ఉంటుంది.
అందుకే చిన్నపిల్లలను అందరూ ఇష్టపడుతుంటారు.వారితో ఆడుకునేందుకు సరదా పడుతుంటారు.
అయితే తాజాగా ఒక చిట్టిపాప చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తుంది.

ఓ చంటిపాపకు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో( Passport size photograph ) తీయించాలని ఫొటో స్టూడియోకు తండ్రి తీసుకెళ్లాడు.దీంతో ఫొటో స్టూడియోలో పాపను ఫొటో తీయడానికి ఫొటోగ్రాఫర్ కష్టపడాల్సి వచ్చింది.పాపను సింగిల్‌గా ఫొటో తీయాల్సి ఉంది.
కానీ పాప ఏమో తండ్రిని అసలు వదిలిపెట్టడం లేదు.నాన్న లేకుండా ఫొటో దిగేందుకు పిల్ల ఆసక్తి చూపడం లేదు.
ఒక్కదానినే ఫొటోను తీయడానికి ఫొటోగ్రాఫర్ ప్రయత్నిస్తుండగా.పాప వెంటనే తండ్రి దగ్గరకు వస్తోంది.
దీంతో పాపను ఫొటో తీయించడానికి తండ్రి సూపర్ ఐడియా వేశాడు.

పాపను ఫొటో తీయించడానికి తండ్రి( father ) తల నుంచి కాళ్ల వరకు తెల్లని వస్త్రాన్ని కప్పుకున్నాడు.ఆ తర్వాత తన ఒడిలో కుమార్తెను కూర్చోబెట్టుకున్నారు.దీంతో ఫొటోగ్రాఫర్ వెంటనే చిన్నారిని ఫొటోతీశాడు.
దీంతో ఎలాగోలా ఫొటో తీయడంతో ఫొటోగ్రాఫర్ పని పూర్తయింది.పాపను పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తీసేందుకు ఫొటోగ్రాఫర్ ఇలా కష్టపడాల్సి వచ్చింది.
దీనికి తండ్రి వేసిన సూపర్ ఐడియా చూడటానికి భలే ఉంది.దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.తండ్రి టెక్నిక్ కొత్తగా ఉందని కొంతమంది అంటుండగా.
పాప భలే క్యూట్ గా ఉందని మరికొందరు చెబుతున్నారు.ఇక మరికొందరు మా అబ్బాయి ఫొటో ఇలా తీసి ఉండాల్సింది అని వ్యాఖ్యానిస్తున్నారు.







