భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( Harman Preet Kaur ) కు ఊహించని షాక్ తగిలింది.ఏసియన్ గేమ్స్( Asian Games ) లో భాగంగా చైనాలోని Hangzhou వేదికగా జరుగుతున్న తొలి రెండు టీ20 మ్యాచ్లకు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లేకుండానే జట్టు బరిలోకి దిగనుంది.
ఇటీవలే జరిగిన బంగ్లాదేశ్- భారత్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ దురుసు ప్రవర్తన కారణంగా ఐసీసీ హర్మన్ కు 4డీ మెరిట్ పాయింట్లు కేటాయించిన విషయం తెలిసిందే.ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక క్రికెటర్ కు 2డీ మెరిట్ పాయింట్లకు ఒక టీ20 మ్యాచ్ నిషేధం( T20 match ban ) ఎదుర్కోవాల్సి ఉంటుంది.
హార్మన్ కు 4డీ మెరిట్ పాయింట్లు ఇవ్వడంతో.భారత జట్టు తదుపరి అడే ఆసియా క్రీడల్లో తోలి రెండు టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

అయితే ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆసియాలో( Asia ) టాప్ జట్టుగా ఉన్న భారత్ ఏసియన్ గేమ్స్ లో నేరుగా క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.ఇక భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లేకుండానే భారత జట్టు ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు చేరుకుంటే హర్మన్ ప్రీత్ కౌర్ ఆ మ్యాచ్లో ఆడెందుకు అర్హత కలిగి ఉంటుంది.ఇక తదుపరి రెండు మ్యాచ్లకు భారత జట్టుకు స్మృతి మందాన నాయకత్వం వహించే అవకాశం ఉంది.
భారత జట్టు ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో గోల్డ్ మెడల్ పై కన్నేసింది.కానీ హర్మన్ ప్రీత్ కౌర్ లేకుండా బరిలోకి దిగడం ఒక పెద్ద లోటుగానే పరిగణించాలి.







