సెంటిమెంట్ ను పక్కన పెడుతున్న స్టార్ డైరెక్టర్స్... హిట్ కొట్టేరా?

సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు సెలబ్రిటీలు అలాగే దర్శకనిర్మాతలు కొన్ని సెంటిమెంట్లను బాగా నమ్ముతూ ఉంటారు.ఇలా ఆ సెంటిమెంట్లను వారు సినిమాలలో ఫాలో అయితే కనుక సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తారు.

 Star Directors Who Keep Aside The Sentiment, Gopichand Malineni,thrivikram Srini-TeluguStop.com

ఇలా సెంటిమెంట్లను ఫాలో అయ్యే డైరెక్టర్లలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Thrivikram Srinivas ) అలాగే గోపీచంద్ మలినేని ( Gopichand Malineni ) కూడా ఒకరిని చెప్పాలి.త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు.

అయితే ఈయన గత రెండు సినిమాలలో కూడా హీరోయిన్ గా పూజ హెగ్డేని ( Pooja Hedge )తీసుకున్నారు.ఈ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.

Telugu Gunturu Kaaram, Krack, Raviteja, Tollywood-Movie

అప్పటినుంచి త్రివిక్రమ్ సినిమాలకు పూజ సెంటిమెంట్ గా మారిపోయింది.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం ( Gunturu kaaram ) సినిమాలో కూడా మొదట్లో పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారు.అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.మరి పూజా హెగ్డే తప్పుకోవడానికి కారణాలు తెలియక పోయినప్పటికీ త్రివిక్రమ్ మాత్రం ఈ విషయంలో తన సెంటిమెంట్ బ్రేక్ చేసుకున్నారని చెప్పాలి.

అలాగే గోపీచంద్ మలినేని కూడా తన సినిమాలలో శృతిహాసన్ ( Shruthi Hassan ) ఉంటే సినిమా హిట్ అవుతుందని భావిస్తారు.

Telugu Gunturu Kaaram, Krack, Raviteja, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈయన దర్శకత్వంలో వచ్చిన వరుస రెండు సినిమాలలో శృతిహాసన్ నటించిన ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి.అయితే ఈసారి మాత్రం ఈయన రవితేజ ( Raviteja )హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం శృతిహాసన్ కాకుండా మరొక కొత్త హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

దీంతో గోపి చంద్ మలినేని కూడా హీరోయిన్ విషయంలో తన సెంటిమెంట్ బ్రేక్ చేశారని తెలుస్తుంది.మరి వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube