నిషా ఘిమిరే…( Nisha Ghimire ) ఈమె ఒక ప్రఖ్యాత మోడల్ తోపాటు నటి.నేపాల్( Nepal ) దేశ రాజధాని కాట్మండులో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఈమె తన ప్రతిభతో తన కుటుంబ పేదరికాన్ని దూరం చేయాలనీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
తన ఆశలు నిజమవుతున్నాయి కూడా.మోడలింగ్ లో( Modelling ) మంచి గుర్తింపు తెచ్చుకున్న నిషా, “సాథి, ఆజా నిస్తూరికో” వంటి ఫేమస్ నేపాలీ పాటలలో మెరిసి ప్రేక్షకుల మన్నలను అందుకుంది.
నేపాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవడానికి పోటీ పడ్డాయి.ఆమె కోరుకున్న గుర్తింపు, ఐశ్వర్యం అన్ని ఆమె చెంతకు రావడం మొదలైంది.ఇంతలోనే ఆమె జీవితం ఒక విషాద మలుపు తిరిగింది.
2019 జనవరిలో నిషా మోడలింగ్ చదివేందుకు ఇండియా లోని డెహ్రాడూన్ వచ్చారు.ఇక్కడ ఆమె దురదృష్టవశాత్తు ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి( Road Accident ) గురయ్యారు.అంతే.
అప్పటివరకు సుఖ సంతోషాలతో ఉన్న ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులయింది.ఆమె కుటుంబం హాస్పిటల్ ఖర్చులను భరించలేకపోయారు.
స్నేహితులు, బంధువులు ఎవ్వరు సహాయం చెయ్యడానికి ముందుకు రాలేదు.ఆమె కోసం పోటీ పడ్డ వ్యాపారవేత్తలు, ఎంటర్‌టైనర్లు అదృశ్యమయ్యారు.
ఆమె బాగున్నప్పుడు ఆమెతో ఉండాలన్న వాళ్లంతా మాయమయ్యారు.నెలరోజుల తరువాత ఆమెను నేపాల్లోని తన స్వగృహానికి తిరిగి తీసుకువచ్చారు.
ఆమె మరణం కోసం వేచిచూసారు.
నిషా కెరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, ఆమెను తన బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవాలి అనుకున్నవాళ్లలో మేఘా చౌదరి( Megha Choudary ) అనే వ్యాపారవేత్త కూడా ఉన్నారు.కానీ మేఘా వ్యాపారం చిన్నది అయినందున మేఘాతో కలిసి పని చేయకూడదని నిషా మేనేజర్ ఆమెను అడ్డుకున్నారు.నిషా అనారోగ్యం గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంది మేఘ చౌదరి.
ఎవ్వరు సహాయం చెయ్యడానికి ముందుకురాని సమయంలో మేఘ మాత్రమే నిషాకు తోడుగా నిలిచింది.
నోరువిక్లో నిషా హాస్పిటల్ బిల్లులను చెల్లించింది.ఆశ్చర్యం ఏమిటంటే మేఘతో నిషాను పనిచేయకుండా ఆపిన మేనేజర్ కూడా నిషా పక్కన లేడు.మేఘ ఎంత ప్రయత్నించినా నిషాను కాపాడలేకపోయింది.
నిషా అక్టోబర్ 1, 2021న తుది శ్వాస విడిచింది.అంత్యక్రియల ఖర్చులతో పాటు, నిషా తోబుట్టువుల ఫీజులు కూడా చెల్లించింది మేఘ చౌదరి.నిషా ఘిమిరే జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే.“ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు”.నిజమైన మానవత్వానికి ఉదాహరణ మేఘ చౌదరి.