ప్రపంచంలోనే అత్యంత చిన్న ఎస్కలేటర్‌.. ఎక్కడ కనిపెట్టారంటే?

ఇక్కడ మీకు ఫొటోలో కనిపిస్తున్నదే ప్రపంచంలో అతి చిన్న ఎస్కలేటర్‌.( World Shortest Escalator ) దాంతో ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఎస్కలేటర్‌గా గిన్నిస్‌బుక్‌లో( Guinness Book ) చోటు దక్కించుకోవడం విశేషం.

 World Shortest Escalator Located In Japan Kawasaki Details, Smallest Escalator,-TeluguStop.com

జపాన్‌లోని( Japan ) కవాసాకి నగరంలో కొలువుదీరిన ఈ ఎస్కలేటర్‌ చూపరులను కట్టిపడేస్తుంది.కవాసాకి( Kawasaki ) రైల్వే స్టేషన్‌ దక్షిణం వైపు ద్వారం నుంచి బయటకు వస్తే, ఎదురుగా కనిపించే ‘మోర్‌” డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌లో ఈ బుల్లి ఎస్కలేటర్‌ ఉంది.

దీనికి ఉన్నవి కేవలం 5 మెట్లు మాత్రమే! చిన్నపిల్లలు కూడా ఎక్కగలిగే ఆ మెట్లు కలిగిన ఎస్కలేటర్‌ను ఎందుకు ఏర్పాటు చేశారో మాత్రం ఎవరికీ అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.అయినా, వింతగా ఉండటంతో దీనిని చూడటానికి జనాలు అక్కడికి క్యూలు కడుతున్నారు.

Telugu Guinness, Japan, Kawasaki, Petite, Shortest, Smallest, Worlds Shortest-La

దీనికి అక్కడ అధికారికంగా అక్కడ ‘పెటిట్ ఎస్కలేటర్’( Petite Escalator ) అని పిలుస్తారు.ఇది కవాసకిలోని మోర్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్ బేస్‌మెంట్‌లో కలదు.ఇక ఇది ఎంత చిన్నది అంటే? దిగువనుండి ఎగువ వరకు చూస్తే మధ్యలో వ్యత్యాసం కేవలం 83.4cm మాత్రమే వున్నాయి.అక్కడ మోర్స్ యొక్క B2 బేస్‌మెంట్ స్థాయి మరియు JR కవాసకి స్టేషన్ మరియు కైక్యు కవాసకి స్టేషన్ మధ్య ప్రాంతాన్ని కవర్ చేసేలా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.అజలేయా షాపింగ్ సెంటర్ B2 బేస్‌మెంట్ కి ఈ ఎస్కలేటర్ మిమ్మల్ని తీసుకువెళుతుంది.

ఎస్కలేటర్ ఎక్కడానికి కూడా మీరు కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మరి.

Telugu Guinness, Japan, Kawasaki, Petite, Shortest, Smallest, Worlds Shortest-La

అక్కడ వున్న ప్రవాసాంధ్రులు ఎవరన్నా దానిని చూడాలనుకుంటే అజలేయా షాపింగ్ సెంటర్ నుండి ఎగ్జిట్ 29కి ప్రక్కనే ఉన్న మోర్‌ ప్రవేశ ద్వారం గుండా వెళితే మీకు అది కనిపిస్తుంది.ఇక ఈ విచిత్రమైన ఎస్కలేటర్‌ గిన్నిస్ రికార్డుల్లోకి( Guinness Book ) ఎక్కడంతో జనాలు దానిని గురించి చాలా ప్రత్యేకంగా ఇంటర్నెట్లో శోధిస్తున్నారు.దీనిని గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.ఒకరు దీనిని మరుగుజ్జు ఎస్కలేటర్‌ అని పేర్కొనగా మరొకొందరు ఈ ఎస్కలేటర్‌ వలన ఏమిటి ఉపయోగం? అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నలు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube