టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో ప్రమోదిని ఒకరు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రమోదిని( Pramodini ) మాట్లాడుతూ శ్రీలక్ష్మి నాకు చాలా క్లోజ్ అని నాకు ఇష్టమైన పర్సన్ అని ఆమె అన్నారు.
శ్రీలక్ష్మి చాలా స్వీట్, జెమ్, ఇన్నోసెంట్ అని ప్రమోదిని తెలిపారు.హ్యాష్ ట్యాగ్ బ్రో సినిమా( Bro movie ) షూట్ సమయంలో శ్రీలక్ష్మికి పుడ్ పాయిజన్ అయిందని ఆమె అన్నారు.
ఆ సమయంలో మా ఫ్యామిలీ డాక్టర్ కు ఫోన్ చేయగా ఆయన కొన్ని సూచనలు చేయగా ఆ సూచనలను నేను పాటించానని ప్రమోదిని వెల్లడించారు.ఆ సమయంలో నేను చాలా భయపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.
శ్రీలక్ష్మి ( Sri Lakshmi )గారు నన్ను కన్న కూతురిలా చూసుకున్నారని ప్రమోదిని పేర్కొన్నారు.నేను బెక్కం వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ చెప్పాలని నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమా కోసం సార్ ను కలవగా ఆయన ఛాన్స్ ఇవ్వగా మరో సినిమా డేట్స్ తో క్లాష్ అయ్యిందని ఆమె పేర్కొన్నారు.

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాలో నేను గెస్ట్ రోల్ లో కనిపించానని ప్రమోదిని అన్నారు.హుషారు సినిమాలో మంచి రోల్ ఇచ్చారని ప్రమోదిని అన్నారు.నేను మదర్ రోల్స్ లోనే ఎక్కువగా చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు.ఎలాంటి రోల్ ఇచ్చినా ఓకే అని ఆమె చెప్పుకొచ్చారు.సామజవరగమన సినిమాలో నేను నరేష్ గారిని కొట్టలేదని( Sr Naresh ) గ్రాఫిక్స్ లో అలా చూపించారని ప్రమోదిని తెలిపారు.సామజవరగమన సినిమాలో( Samajavaragamana ) ఏదో చిన్న రోల్ అనుకుంటే చాలా పెద్ద రోల్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

శ్రీవిష్ణు, నరేష్ కాంబినేషన్ లో నన్ను ఎంపిక చేసుకోవడం సంతోషంగా అనిపించిందని ప్రమోదిని అన్నారు.ఇండస్ట్రీలో పోటీ అనేది ఉండదని ఆమె పేర్కొన్నారు.స్క్రీన్ లో కనిపించేవరకు సినిమాల్లో ఏదీ నమ్మకం పెట్టుకోకూడదని ప్రమోదిని వెల్లడించారు.ప్రమోదిని తెలుగులో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ప్రమోదినిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







