కేటీఆర్ జన్మదినం( Minister KTR Birthday ) సందర్భంగా సుమారు 100 మంది అనాధ ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు సోమవారం వివిధ రకాల పండ్లను ప్రత్యేకంగా తయారు చేయించిన చేతి బ్యాగులో పెట్టి జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు అందజేశారు.జెడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddipet Mandal ) హరిదాస్ నగర్ లో గిఫ్ట్ ఏ స్మైల్ ప్లకార్డులు పట్టుకొని కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ప్రత్యేకమైన బ్యాగులు తయారు చేయించి వాటిపై కేటీఆర్ బొమ్మలను అచ్చు వేయించాడు అదే బ్యాగులో బ్రెడ్డు, దానిమ్మ పండ్లు, సేపులు, అరటి పండ్లు, సంత్రాలు వంటి పండ్లను పెట్టి వృద్ధులకు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు, ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, గ్రామ సర్పంచి తో పాటు పలువురు పాల్గొన్నారు.







