'గాండీవధారి అర్జున' టీజర్ రిలీజ్.. యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో అదిరింది!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.ఈయన ముందు నుండి సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

 Varun Tej And Praveen Sattaru's 'gandeevadhari Arjuna' Official Teaser, Gandeeva-TeluguStop.com

అందుకే ఈయన మెగా ఇమేజ్ నుండి బయట పడి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.ఇక వరుస హిట్స్ అందుకుంటున్న వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది.

ప్రజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.ఆ లైనప్ లో ముందుగా రిలీజ్ కానున్న మూవీ ”గాండీవధారి అర్జున”.( Gandeevadhari Arjuna ) ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఆగస్టులో రిలీజ్ ఉండడంతో షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.

ఈ క్రమంలోనే ఇటీవల ప్రీ టీజర్ రిలీజ్ చేసారు.ఇక తాజాగా టీజర్ రిలీజ్ చేసారు.ఈ టీజర్ యాక్షన్ ప్యాక్డ్ తో అలరిస్తుంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏజెంట్ గా నటించినట్టు టీజర్ ద్వారా అర్ధం అవుతుంది.ప్రధాన పాత్రలన్నీ టీజర్ లో చూపించారు.

మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు గ్రాండ్ నిర్మాణ విలువలు కూడా ఆకట్టుకునేలా చేసాయి.ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటిస్తుండగా.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube