సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్ధాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో చేపట్టనున్న 50,793 ఇళ్ల నిర్మాణానికి, 45 సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లే అవుట్ వద్ద శంకుస్థాపన చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.
ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి( Tadepalli ) నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు, అక్కడ వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇళ్ళ నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడే మోడల్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.