సూర్యాపేట జిల్లా: మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడటాన్ని టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు పేరం ముత్తయ్య,ప్రధాన కార్యదర్శి సిహెచ్.భిక్షం తీవ్రంగా ఖండించారు.
మణిపూర్ మరణహోమంపై ఆదివారం జిల్లా కేంద్రంలో టిపిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్ లో అగ్రకుల మైతేయి తెగకు చెందినవారు గిరిజన కుకి తెగకు చెందిన ఇద్దరు ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక లైంగిక దాడికి పాల్పడం దారుణమన్నారు.
మే 4 న జరిగిన ఈ దుర్మార్గమైన సంఘటన 2 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిందని,ఇంతకాలం ఈ సంఘటన వెలుగులోకి రాకపోవడానికి కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు.
ఈ దారుణ సంఘటనకు స్థానిక పోలీసులు మరియు అధికార యంత్రాంగం యొక్క హస్తం వుందని ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్త సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే వుంటే ఈ ఘటనను సుమోటోగా తీసుకుంటానని సుప్రీం కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.మే నెలలో మణిపూర్ మైదాన ప్రాంతంలో మెజారిటీగా వుండే మైతెయి జాతికి పాలకులు ఆదివాసీ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడమే దీనికి కారణమని,ఈ అల్లర్లలో ఎంతో మంది మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురయ్యారని,ఇల్లు ఆస్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్ లో దారుణమైన హింసను అనుభవిస్తున్నారని,ఇంత జరుగుతున్నా స్త్రీలపై హింసకు,లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో కానీ, మణిపూర్ లో శాంతిభద్రతలను కాపాడటంలో కానీ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైపల్యం చెందాయని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పి.
డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, ప్రజాసంఘాల నాయకులు బుద్ధ సత్యనారాయణ, చామకూరి నర్సయ్య, నరబోయిన వెంకట్ సంఘీభావం తెలియజేస్తూ అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్స్ కె.కృష్ణవేణి,టి.పూలన్,జిల్లా ఉపాధ్యక్షులు పి.వీరన్న, బండారు శ్రీనివాస్,మైలా చంద్రయ్య,ఏ.మల్లారెడ్డి, ఎస్.యాకయ్య,గడ్డం కృష్ణారెడ్డి,మారోజు కృష్ణమూర్తి,అశోక్, నర్సిరెడ్డి,యాదగిరి, పొలిశెట్టి శ్రీనివాస్,తన్నీరు రమేష్,సిహెచ్.అంజయ్య, సట్ల శంకర్,డి.
యాదగిరి, ఎస్.రాములు,ఆర్.సైదులు,సుధాకర్, మహేష్,సురేందర్, సాలయ్య,యాదగిరి, పి.రవికుమార్, మల్లికార్జున్,శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.