Sreeleela : అలా చేయొద్దంటూ శ్రీలీలకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్న అభిమానులు.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీలీల( Heroine Sreeleela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని ఏర్పరచుకుంది.

 Fans Fires On Heroine Sreeleela News Viral In Social Media-TeluguStop.com

కాగా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ పెరిగిపోవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు డైరెక్టర్ లు హీరోయిన్ శ్రీలీల వైపు ఎక్కువ శాతం మొగ్గుచూపుతున్నారు.అలా ఒకరు ఇద్దరు హీరోలతో కాదు ఎంతోమంది హీరోలతో నటించడానికి ఇప్పటికే ఓకే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇప్పటికే పవన్ కళ్యాణ్, శ్రీ లీల, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, లాంటి హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.టాలీవుడ్ యంగ్ హీరోలే కాదు.సీనియర్ హీరోలు( Senior Heroes ) సైతం ఈమె కోసం క్యూ కడుతున్నారు.ఇక ఈమె చేతిలో దాదాపు 12 సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక శ్రీలీల మార్నింగ్, ఆఫ్టర్ నూన్, అండ్ నైట్, మిడ్ నైట్ షూటింగులకు హాజరువుతోందట.అందుకు గల కారణం ఆమె వరుసగా సినిమాలు కమిట్ అవ్వడమే.

రోజంతా షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది ఈ భామ.వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న శ్రీలీల సోషల్ మీడియా( Social Media )లోనూ యాక్టివ్ గా ఉంటోంది.

తాజాగా ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.అందుకు గల కారణం ఆమె అందంలో మార్పులు వచ్చాయట. ఫేస్ లో గ్లో పోయిందని అంటున్నారు.డే అండ్ నైట్ షూటింగ్ ల వల్ల ఆమె అందం పోతుందని హెల్త్ పరంగా( Sreeleela Health ) కూడా గ్యాప్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ధమాకా సినిమాలో ఉన్నట్లు ఇప్పుడు లేదని అంటున్నారు.శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తూ బిజిగా గడుపుతోంది.కానీ తన ఆరోగ్యంపై కూడా శ్రద్ద తీసుకుంటే బాగుంటుందని నెటిజన్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube