తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఛార్మి( Actress Charmi ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించడంతో పాటు బిజీ బిజీగా మారిపోయింది.గ్లామర్ హీరోయిన్‌గా ఒక ఊపు ఊపేసింది.
స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది.దాదాపు ఏడెనిమిదేళ్ల పాటు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది చార్మి.
కాగా చార్మీ హీరోయిన్ గా నటించిన సినిమాలలో వేణు తొట్టెంపూడి( Venu Thottempudi )తో కలిసి ఒక సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
![Telugu Charmy Kaur, Mayagadu, Yalamanchi Ravi-Movie Telugu Charmy Kaur, Mayagadu, Yalamanchi Ravi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/Charmy-Kaur-Venu-Thottempudi-Mayagadu-Movie-issue.jpg)
మాయగాడు( Mayagadu ) చిత్రంలో వేణు తొట్టేంపూడి హీరోగా నటించగా, ఛార్మి హీరోయిన్.రెండేళ్ల గ్యాప్ తర్వాత వేణు రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రమిది.దిలిప్ పోలన్ దర్శకత్వం వహించారు.
సాంబశివ క్రియేషన్స్ పతాకంపై యలమంచిలి రవి ఈ సినిమా నిర్మించారు.చాలా డిలే తర్వాత 2011 జులై 16న ఈ సినిమా విడుదలైంది.
నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది.అయితే ఈ మాయగాడు సినిమా సమయంలో ఛార్మి, నిర్మాతకి మధ్య గొడవలు అయ్యాయి అని అప్పట్లో వార్తలు జోరుగా వినిపించాయి.
ఇది కాస్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.ఇది ఇలా ఉంటే తాజాగా.
తాజాగా నిర్మాత యలమంచి రవి( Producer Yalamanchi Ravi ) ఈ విషయం గురించి స్పందించారు.
![Telugu Charmy Kaur, Mayagadu, Yalamanchi Ravi-Movie Telugu Charmy Kaur, Mayagadu, Yalamanchi Ravi-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/Producer-Yalamanchi-Ravi-Clashes-with-Actress-Charmi.jpg)
యాంకర్ అడిగిన ప్రశ్నకి స్పందిస్తూ, మాయగాడు సినిమా పూర్తయ్యింది.హీరోయిన్‌కి పారితోషికం అంతా ముందే ఇచ్చేశాం.ఏం సమస్య లేదు.
కానీ రిలీజ్ టైమ్‌లో హీరోయిన్ ప్రమోషన్స్ కి రాలేదు.ఎంత అడిగినా నో చెప్పేది.
చాలా ఇబ్బంది పెట్టింది.ప్రమోషన్స్ సమయంలో హ్యాండ్ ఇవ్వడంతో తాము రైజ్ కావాల్సి వచ్చిందని, చాలా అగ్రెసివ్‌గా వెళ్లాము అని తెలిపారు యలమంచి రవి.దీంతో ఆ విషయాన్ని మా అసోసియేషన్‌లో( MAA Assoication ) కంప్లెయింట్ చేసిందని, అప్పుడు మరళీమోహన్ అధ్యక్షుడిగా ఉన్నాడని, ఆయన మాట్లాడి సెటిల్ చేశారని, ఆ తర్వాత ప్రమోషన్స్ కి వచ్చిందని అన్నారు.కానీ సినిమా ఫెయిల్ అయ్యిందని తెలిపారు రవి.