తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) బలోపేతానికి సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది .ఇటీవల తన వారాహి యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్( YS Jagan ) ని ఏకవచనంతో టార్గెట్ చేసి విమర్శలు చేసిన పవన్( Pawan Kalyan ) రాష్ట్ర రాజకీయాల్లో టాప్ ఆఫ్ ది టౌన్ గా మారారు.
ప్రభుత్వ వైఫల్యాలను అంశాల వారీగా సాక్షాలతో తో సహా పబ్లిక్ ముందు పెట్టి ప్రభుత్వ పాలన ను ఎండగట్టిన పవన్ జగన్ పై వ్యక్తిగతంగా కూడా కొన్ని విమర్శలు చేశారు.ఆయన మాట్లాడే విధానాన్ని ఆయన హవ బావాలను ఇమిటేట్ చేస్తూ ముఖ్య మంత్రి స్థానానికి నువ్వు సరిపోవు కాబట్టి ఇకపై నిన్ను ఏకవచనంతోనే పిలుస్తానంటూ జగన్ ని జగ్గు భాయ్ అని కూడా విమర్శలు చేశారు .ఇది భారీ ఎత్తున చర్చనీయాంశం కావడంతో తన యువగళం పాదయాత్రలోకేష్ అదే పంథా ఫాలో కావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

వెంకటగిరి సభలో తనపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్ పై లోకేష్ పవన్ స్టైల్ లో రివర్స్ అటాక్ ఇచ్చారు .ముఖ్యమంత్రిని ఫ్రస్టేషన్ బాయ్ గా అభివర్ణించిన లోకేష్( Nara Lokesh ) తన స్విమ్మింగ్ పూల్ వీడియోలు కావాలంటే వాట్సాప్ నెంబర్ చెప్తే తానే పంపిస్తాను కదా దానికి ఎందుకు ఇంత వృధా ప్రయాస అని వాఖ్యనించారు .తన గురించి తెలుసుకోవాలంటే యూట్యూబ్ వీడియోలు చూడాలని నీ గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లూకౌట్ చూస్తే సరిపోతుందని, ఎవరు ఎవరితో ఫోన్లో ఎంత సేపు మాట్లాడుతున్నారో పూర్తి వివరాలు తెలుసుకుంటే నీ గుండాగి పోతుందంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ ను ఏకవచనంతో పిలుస్తూ పలుమార్లు తన ప్రతి విమర్శకు చివర జగన్ అంటూ సంబోధించారు.ఇది వారాహి యాత్ర( Varahi Yatra )లో పవన్ అనుకరించిన స్టైల్ అని ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తుంది కాబట్టి అదే రూట్ ని తాను కూడా ఫాలో అవ్వాలని లోకేష్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.అంతేకాకుండా వారాహి యాత్రలో పవన్ ప్రస్తావించిన పలు కీలక అంశాల్ని లోకేష్ కూడా తన స్పీచ్ లో రిపీట్ చేశారు.







