జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తన పార్టీ ప్రకటించిన తర్వాత ఒకప్పుడు ప్రజారాజ్యంలో కీలకంగా పనిచేసిన చాలామంది కార్యకర్తలను తిరిగి జనసేనలో( Janasena ) యాక్టివ్ చేశారు .పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసి నష్టపోయిన వారిని గుర్తించి తిరిగి జనసేనలో వారికి ప్రాధాన్యతను ఇవ్వటం ప్రారంభించారు.
అయితే అప్పట్లో ప్రజారాజ్యం తరుపున కీలకంగా పనిచేసిన కొంతమంది కీలక నేతలను మాత్రం పవన్ దూరంపెట్టారు .అందులో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు .ప్రజారాజ్యం పార్టీని బలహీనపరిచి కాంగ్రెస్లోకి విలీనం చేసే దిశగా చిరంజీవిని సిద్ధం చేసిన వారిలో గంటా కూడా ఒకరని పవన్ కళ్యాణ్ భావన.దాంతో జనసేన లో చేరడానికి గంటా ఇంతకుముందు కూడా ఆసక్తి చూపించినప్పటికీ పవన్ అందుకు ఓకే చెప్పలేదని ప్రచారం ఉంది.

అయితే క్రమంగా పరిస్థితులు మారుతున్నట్లుగా తెలుస్తుంది.జనసేనపై వైసీపీ ప్రభుత్వం తీసుకొబోతున్న లీగల్ చర్యలను గంటా శ్రీనివాస రావ్( Ganta Srinivasa Rao ) తప్పు పట్టారు.ఆయన తన ట్విటర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వాన్ని నిలదీశారు .పవన్తో ఏమంత తప్పు మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవడానికి సర్కారు సిద్ధమవుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు.ఈ ప్రభుత్వo అనేక విషయాల్లో విఫలమైందని ప్రత్యేక హోదా గాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ జాబ్ క్యాలెండర్ విషయాల్లో గాని సంపూర్ణ మధ్య నిషేధం విషయాల్లో గాని ఇలా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను నెరవేర్చుకోలేకపోయిందని, మరొకసారి ఓట్లుని అడిగే అర్హత ఈ పార్టీకి లేదని ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

అయితే గత కొద్ది రోజులుగా జనసేనకు దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్న గంటా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది.ఇటీవల జనసేనలో జాయిన్ అయిన విశాఖ మాజీ వైసీపీ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ) రాజకీయ ప్రస్థానం గంటా తోనే మొదలైందని, ఇప్పటికీ ఆయన గంటా శ్రీనివాసరావు తో మంచి సంబందాలు కలిగి ఉంటారని చెప్తుంటారు.ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో జనసేన ను బలంగా నిలబెట్టాలి అంటే గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తుల అవసరం పార్టీకి ఉంటుందని పవన్ కూడా రియలైజ్ అయ్యారని ఆ దిశగా గంటా రావాలనుకుంటే అంగీకరించే ఉద్దేశం లోనే ప్రస్తుతానికి జనసేన ఉన్నట్లుగా తెలుస్తుంది.
అయితే తెలుగుదేశం కూడా గంటాకు ఇప్పుడు బాగానే ప్రాధాన్యతనిస్తున్నందున ఆయన పార్టీ మారతారా లేక జనసేన బలోపేతానికి పరోక్షంగా సహకరిస్తారా అన్నది చూడాలి
.






