తెలుగు ప్రేక్షకులకు హీరో వరుణ్ తేజ్( Mega Hero Varuntej ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగా హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ హీరోగా తన గట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
అయితే మెగా హీరోలు అందరూ ఒకవైపు అయితే వరుణ్ తేజ్ మాత్రం మరో వైపు అని చెప్పవచ్చు.ఎందుకంటే ఎంపిక విషయంలో మెగా హీరోలు అందరికీ వరుణ్ తేజ్ పూర్తిగా బిన్నంగా ఉంటారని చెప్పవచ్చు.
మెగా హీరోలు కమర్షియల్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంటే, వరుణ్ తేజ్ మాత్రం రకరకాల జోనర్ లలో వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

కానీ, ఆయనకు ఇప్పటి వరకు సరైన కమర్షియల్ బ్లాక్‌బస్టర్ పడలేదు.F2 కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ అయినా అది విక్టరీ వెంకటేష్ ఖాతాలోకి కూడా వెళ్తుంది.కాబట్టి, వరుణ్ తేజ్‌కు సోలోగా ఒక స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ అవసరం ఉంది.
అయినా కూడా కథల ఎంపిక విధానంలో మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు వరుణ్.గత ఏడాది కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని( Ghani Movie ) అనే బాక్సింగ్ మూవీ చేశారు.
ఇది కూడా వైవిధ్యమైన కథే.అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి స్టార్లు కూడా ఈ సినిమాను కాపాడలేకపోయారు.కానీ, ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్, కటౌట్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.ఇక ప్రవీణ్ సత్తారు ( Praveen Sattaru )దర్శకత్వంలో రూపొందుతున్న గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా( Gandeevadhari Arjuna )తో పాటుగా వరుణ్ తేజ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో తన 14వ చిత్రానికి వరుణ్ తేజ్ సైన్ చేశారు.వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.#VT14 వరుణ్ తేజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రం కానుందని సమాచారం.కరుణ కుమార్( Karuna Kumar ), వరుణ్ తేజ్ కోసం కూడా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారట.వరుణ్ తేజ్‌ని మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి రెడీ అవుతున్నారట.ఈ పాత్ర పోషించడానికి వరుణ్ తేజ్ కంప్లీట్ డిఫరెంట్‌గా మేకోవర్( Varun Tej New Look ) అవుతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.1960 నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట.60ల నాటి వాతావరణం, అనుభూతి కోసం యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట.ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల ఈ చిత్రానికి పనిచేయబోతున్నారట.
నెల 27న హైదరాబాద్‌లో ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.







