న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఉస్మానియా యూనివర్సిటీ లో పార్ట్ టైం పీజీ

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

2.వైఎస్ వివేకా హత్య కేసు

సిబిఐ చేతులు ఎత్తేసారని సాక్షిలో రాసుకున్నారని ఐఎంఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు క్లియర్ గా ఉందని నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు( MP Raghuram Krishnamraju ) అన్నారు.

3.సీఎం డైరెక్షన్ లోని ఓట్లు తొలగిస్తున్నారు : టిడిపి

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

విశాఖలో 40,000 ఓట్లను తొలగించారని టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు.సీఎం జగన్ డైరెక్షన్ లోనే అధికారులు ఓట్లను తొలగిస్తున్నారని వెలగపూడి విమర్శించారు.

4.ఐఏఎస్ అధికారిణి రాను సాహు అరెస్ట్

మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి రాను సాహును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు.

5.షర్మిలకు ప్రాణహాని ఉంది

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

వైఎస్సార్ టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు( YS Sharmila ) జగన్ నుంచి ప్రాణహాని ఉందని టిడిపి నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.

6.తెలంగాణ బిజెపి కార్యాలయంలో కీలక సమావేశం

తెలంగాణ బిజెపి కార్యాలయంలో కీలక సమావేశం మొదలైంది.ఈరోజు ఉదయం బిజెపి నేతలతో రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జీలు ప్రకాష్ జకాదేకర్ సహ ఇన్చార్జి సునీల్ బన్సాల్ సమావేశం అయ్యారు.

7.టిడిపి జూన్ 2 కోఆర్డినేటర్ గా రవి మందలపు

టిడిపి జూన్ 2 కోఆర్డినేటర్ గా రవి మందలపు ఎన్నికయ్యారు.

ఇటీవల ముగిసిన తానా 23వ సమావేశాలు సందర్భంగా జరిగిన ఎన్నారై టిడిపి యుఎస్ఏ సమావేశం జరిగింది.ఉభయగోదావరి జిల్లాలను జూన్ 2గా నిర్ణయించారు దీనికి రవి మందలపును కోఆర్డినేటర్ గా నియమించారు.

8.పవన్ వ్యవహారంపై గంటా విమర్శలు

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వం పరువు నష్టం కేసు వేయడంపై మాజీమంత్రి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్( Visakha MLA Ganta Srinivas ) స్పందించారు.పవన్ పై పరువు నష్టం కేసు వేయడానికి ఆయన మీ పరువు నష్టం వాటిల్లే దారుణమైన వ్యాఖ్యలు ఏం చేశారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.

9.మద్యం దుకాణాల్లో డిజిటల్ బోర్డులు

తమిళనాడులో 200 తస్మాక్ మద్యం దుకాణాలను ఆధునికరణ చేయనున్నారు.మద్యం రకాల ధరల జాబితా డిజిటల్ బోర్డులో ప్రదర్శించనున్నారు.

10.తెలుగు రాష్ట్రాలకు హై అలెర్ట్

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.భారత వాతావరణ విభాగం మరో  ప్రకటన చేసింది.నేడు ఏపీ, తెలంగాణలోని అనేక జిల్లాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది.

11.స్వల్పంగా గోదావరి వరద తగ్గుముఖం

గోదావరి వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.భద్రాచలం వద్ద ప్రస్తుత గోదావరి నీటిమట్టం 39.5 అడుగులు ఉంది.

12.కూచిపూడి గొప్పతనంపై…

కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెప్పేందుకు సంస్కృతి ప్రియులంతా కలిసి పనిచేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాంస్కృతిక విభాగం అధిపతి డాక్టర్ జోనల్ గడ్డ అనురాధ అన్నారు.

13.తిరుమల సమాచారం

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది.క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

14.గౌరవెల్లి రిజర్వాయర్ పనులు ఆపేయాలి

గౌరవెల్లి రిజర్వాయర్ పనులను ఆపివేయాలని గోదావరి నది యాజమాన్యం బోటు తెలంగాణ ప్రభుత్వంను ఆదేశించింది.

15.బండి సంజయ్ కు మద్దతుగా ఆత్మహత్యాయత్నం

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కు ఆ పార్టీ అధిష్టానం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గురుకుల కొండాపూర్ బిజెపి నేత సొల్లు అజయ్ వర్మ  ఆత్మహత్యాయత్నం చేశారు.

15.సాగర్ నుంచి ఏపీకి 4.2 టీఎంసీలు

నాగార్జునసాగర్ నుంచి ఏపీకి నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.  ఏపీకి తాగునీటి అవసరాల కోసం సాగర్ నుంచి 4.2 టీఎంసీల నీళ్లు ఇవ్వనుంది.

17.కేటీఆర్ నుంచి బెదిరింపులు

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన సన్నిహితుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని, శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు సుఖేష్ చందర్ శేఖర్ ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేక రాశారు.

18.గెస్ట్ లెక్చరర్ లను కొనసాగించాలి

జస్ట్ లెక్చరర్లకు పోరాట కలిగించేలా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.1654 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించాలని, వారు లేని ప్రాంతాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

19.మూడవ టీఎంసీ పనులు ఆపండి : ఎన్జీటీ

Telugu Amit Sha, Cm Kcr, Amit Shah, Janasena, Kaleswaram, Osmania, Pawan Kalyan,

పర్యావరణ అనుమతులు లేకుండా కాలేశ్వరం( Kaleswaram ) మూడో టిఎంసి ఎత్తిపోతల కన్నులు చేపట్టవద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది.

20.ఆయుష్ ఉద్యోగార్డుల్జ జాబితా

ఆయుష్ విభాగంలో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube