తొందర్లోనే బుల్లితెర అభిమానులకి ఒక పెద్ద పండగ రాబోతుందని విషయం అందరికి తెలుస్తుంది… ఎందుకంటే బుల్లితెర మీద మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా అరు సీజన్ లు కంప్లీట్ చేసుకుంది… ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి( Bigg Boss 7 ) రంగం సిద్ధమైంది….బిగ్ బాస్ షో యాజమాన్యం చెప్తున్న కథనాల ప్రకారం ఈసారి ఈ షో మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు మిళితమై ఉంటాయని నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని పంచుకున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్ కూడా స్టార్ మరియు డిస్నీ+ హాట్ స్టార్ ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే హోస్ట్ ఎవరు అన్నది ఆ టైంలో చెప్పలేదు…
చాలా కాలంగా నాగార్జున( Nagarjuna ) ఈ షో నుండీ తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది.
కానీ అందులో నిజం లేదు అని ఈ మధ్యనే ఓ ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు.అందులో నాగార్జున లుక్ కూడా ఆకట్టుకుంది.
ఇక కంటెస్టెంట్ల గురించి డిస్కషన్ కూడా మొదలైంది.క్రికెటర్ వేణుగోపాలరావు కానీ అంబటి రాయుడు( Ambati Rayudu ) కానీ ఇద్దరిలో ఎవరో ఒక్కరూ బిగ్ బాస్ షో లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది…అలాగే స్టార్ కపుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తుంది…
వాళ్ళతో పాటు కార్తీక దీపం విలన్ అయిన శోభా శెట్టి( Shoba Shetty ) కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట.కార్తీక దీపం సీరియల్ తో ఈమె చాలా పాపులర్ అయ్యింది.ఆ సీరియల్ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది.
అయితే ఆ సీరియల్ తర్వాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు.ఓ సినిమాలో నటించింది.
అది రిలీజ్ కాలేదు.సో ఈమె ప్రస్తుతం ఖాళీ.అందుకే బిగ్ బాస్ లో పాల్గొన బోతున్నట్టు సమాచారం…
ఇక వీళ్లతో పాటు యాదమ్మ రాజు( Yadamma Raju ) అతని భార్య స్టెల్లా( Stella ) ఇద్దరు కూడా ఈ షో లో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి…గత కొద్దిరోజులుగా వీళ్ళు విడిపోతున్నారు అనే కామెంట్లు వస్తున్న నేపథ్యంలో వీళ్లిద్దరి ని కలిపి పెళ్లి గొప్పతనం చెప్పడానికి వీళ్లని షో కి రప్పిస్తున్నరు అని తెలుస్తుంది…
.