బాలీవుడ్ టీవీ నటి, సోషల్ మీడియాలో పాపులర్ పర్సనాలిటీ ఉర్ఫీ జావెద్( Urfi Javed )కు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమెకు బాలీవుడ్ లోఈమెకు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఈమె మాత్రం తన డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.ఇలా ఎంతో విభిన్నమైనటువంటి డ్రెస్ వేసుకుంటూ వీధులలో చక్కర్లు కొడుతూ ఉంటారు.
దీంతో ఒక్కసారిగా పాపులర్ అయినటువంటి ఉర్ఫీ తన డ్రెస్సింగ్ స్టైల్( Derssing Style ) వల్ల కూడా భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.అంతేకాకుండా పలువురు ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు కూడా నమోదు చేశారు.

ఈ విధంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ద్వారా తరచూ వార్తల్లో ఉండే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఓ వ్యక్తి తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేశారని తనని ఈవిటీజింగ్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.ఈమె గురువారం రాత్రి ముంబై నుంచి గోవా( Goa ) వెళుతుండగా విమానంలో తనకు చేదు సంఘటన జరిగిందని తెలిపారు.ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి తన పట్ల వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.
ఎకానమీ క్లాసులో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి తన పట్ల వేధింపులకు పాల్పడినటువంటి వీడియో క్లిప్ కూడా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ వ్యక్తి తనని వివిధ రకాల పేర్లతో ఈవీటిజింగ్ కి పాల్పడిన నేను మాత్రం తనని ఏమీ అనలేదు అయితే పక్కవారిని అడిగి తెలుసుకుంటే తాను ఫుల్ మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు.ఎంత మద్యం మత్తులో ఉన్న ఇలా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని తాను క్షమించలేనని తెలిపారు.అంతేకాకుండా తాను పబ్లిక్ ఫిగర్ కానీ పబ్లిక్ ప్రాపర్టీని కాదు అంటూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







