ప్రతిఒక్కరిపై సినిమాల ప్రభావం( Movies ) ఉంటుంది.కానీ పిల్లల్లో ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
హీరోల్లా కనిపించాలని పిల్లలు ప్రయత్నిస్తుంటారు.వారి ఫేవరెట్ హీరో ఏదైనా స్టైలిష్ కటింగ్ చేయిస్తే వెంటనే ఆ స్టైల్ ని చేయించుకొని వారిలా ఊహించుకుంటారు.
డైలాగులు చెప్పడం, డ్యాన్స్ చేయడం వీడియోలు అయితే వైరల్ అవుతూనే ఉంటాయి.కానీ కొంత మంది పిల్లలు ఏకంగా హీరోలు చేసిన స్టంట్ లు చేసి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు.
ఎక్కువగా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసే చిన్నారులు ఆ హీరోలను ఇమిటేట్ చేస్తుంటారు.అయితే ఇప్పుడు ఒక చిన్నారి ఇలానే ఒక స్టంట్ ప్రయత్నించి స్కూల్ బిల్డింగ్ పై ( School Building ) నుంచి దూకేసింది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అసలు ఆ చిన్నారి ఎవరు, ఏ స్టంట్ వేసిందో ఇప్పుడు చూసేద్దాం.

ఉత్తర్ ప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) కాన్పూర్‌లో ఒక విద్యార్థి ఒక స్టంట్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు.డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషనల్ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.ఎనిమిదేళ్ల విద్యార్థి మూడో తరగతి( Third Class Student ) చదువుతున్నాడు.అయితే నీళ్లు తాగి వాతనై చెప్పి బయటికి వచ్చాడు.బయటికి వచ్చిన విద్యార్ధి క్రిష్ సినిమాని( Krrish Movie ) గుర్తుచేసుకున్నాడు.వెంటనే క్రిష్ సినిమాలో మాదిరి పై నుంచి కిందికి ల్యాండ్ అవ్వాలని బిల్డింగ్ పై నుంచి దూకేసాడు.
దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న భవనం మొదటి అంతస్తు రెయిలింగ్ ఎక్కి జంప్ చేశాడు.అక్కడి నుంచి ఒక్కసారిగా కిందపడిపోయాడు.

ఈ ప్రమాదంలో విద్యార్థికి కాలుకి, ముక్కుకి, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.గమనించిన స్కూల్ యాజమాన్యం వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటన మొత్తం స్కూల్ సీసీటీవీలో రికార్డు అవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాలుడు ఈ స్టంట్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం లేదని స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు.
ఆ తరువాత విద్యార్ధి తల్లి చెప్పిన విషయాలు అందరిని షాక్ కి గురిచేశాయి.బాలుడు ఎక్కువగా క్రిష్ సినిమా చూసేవాడని, సూపర్ స్టార్ లా ఊహించుకున్నాడని, అంతే కాదు ఇలాంటి స్టంట్ చేయాలని ఆ బాలుడికి ఎప్పటి నుంచి కోరిక ఉందని తెలిపింది.
ఈ బాలుడిపై ఇంత ప్రభావం ఉండడంతో అందరు షాకయ్యారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.







