ఎన్నారైలు ఇండియాలో యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

విదేశీయులు లేదా ఎన్నారైలు( NRI ) ఎవరైనా భారతదేశంలోని యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేయవచ్చు.భారతదేశంలోని వివిధ యూనివర్సిటీలు ఎన్నారైలు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి వివిధ మార్గాలను అందిస్తున్నాయి.

 How Nri Students Apply For Ug And Pg Programs In India Details, Foreign National-TeluguStop.com

ఢిల్లీ యూనివర్సిటీ (DU), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU), బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU) వంటి కొన్ని పాపులర్ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను అంగీకరిస్తాయి.

ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఎన్నారై విద్యార్థులు( NRI Students ) వారి స్వదేశీ పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఎన్నారై విద్యార్థులకు ప్రత్యేక కోటా లేదు, కానీ వారు ICCR స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, టిబెట్ వంటి నిర్దిష్ట దేశాల విద్యార్థులకు వారి దేశ దౌత్య కార్యాలయం నుంచి “నో అబ్జెక్షన్ సర్టిఫికేట్”( NOC ) అవసరం.

వారు అధ్యయనం చేయాలనుకుంటున్న ప్రోగ్రామ్‌ను బట్టి రిజిస్ట్రేషన్ ఫీజులు మారుతూ ఉంటాయి.

Telugu Process, Banaras Hindu, Delhi, India, Nri, Nris, Pg Programs, Ug Programs

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా విదేశీ విద్యార్థులను ప్రవేశ పరీక్షల ద్వారా అంగీకరిస్తుంది.వారికి ఇన్-అబ్సెంటియా, కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు వంటి మరిన్ని ఇతర వర్గాలు ఉన్నాయి.దరఖాస్తు చేయడానికి, విద్యార్థులు విద్యా అర్హతలు, విద్యార్థి వీసా లేదా పరిశోధన వీసా, మెడికల్ సర్టిఫికేట్, బీమా వంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి.

Telugu Process, Banaras Hindu, Delhi, India, Nri, Nris, Pg Programs, Ug Programs

బనారస్ హిందూ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.వారు వేర్వేరు మార్కాల్లో నమోదు చేసి ఆర్థిక సహాయం పొందవచ్చు.విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను తనిఖీ చేయవచ్చు.మరొక దేశం నుంచి ఎన్నారైలు భారతదేశంలో చదువుకోవాలనుకుంటే, వారు విదేశీ విద్యార్థుల కోసం కలిగి ఉన్న ప్రవేశ ప్రక్రియను అనుసరించి ఈ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube